Funky Overseas Preview Talk: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న విశ్వక్ సేన్(Vishwak sen), ఈసారి ఎలా అయినా హిట్ కొట్టి మళ్లీ ఫార్మ్ లోకి రావాలనే కసితో చేసిన చిత్రం ‘ఫంకీ’. ఈ చిత్రానికి జాతి రత్నాలు ఫేమ్ అనిరుద్ KV దర్శకత్వం వహించాడు. అనిరుద్ కామెడీ ఎంత వెరైటీ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా అదే తరహా కామెడీ ని ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ ఒక సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, హీరోయిన్ కాయదు లోహర్ నిర్మాతగా నటిస్తోంది. ఇలా సినిమాలో సినిమా కాన్సెప్ట్ తో తీసిన సినిమాలు మన టాలీవుడ్ లో పెద్దగా ఆడలేదు. మరి ఈ సినిమా అయినా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రదర్శించారట.
ఈ ప్రివ్యూ షో కి అక్కడి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సరదాగా, కూల్ గా సాగిపోతుంది అట. ముఖ్యంగా విశ్వక్ సేన్, కాయదు లోహర్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని, వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఫన్నీ గా ఉన్నాయని అంటున్నారు. ఇక అనుదీప్ మార్క్ కామెడీ పంచులు కూడా బాగానే పేలాయట. కానీ కొన్ని డైలాగ్స్ ని మాత్రం అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంటుందట. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, కామెడీ తో పాటు డ్రామా కూడా ట్రై చేసాడట అనుదీప్.
కొన్ని కొన్ని చోట్ల సన్నివేశాలు బాగా ల్యాగ్ అని అనిపిస్తాయట. కొన్ని సన్నివేశాలు అయితే మన సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది అట. మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు బాగా వచ్చిందని, ఓవరాల్ గా సినిమా ఒక టైం పాస్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుందని అంటున్నారు. విశ్వక్ సేన్ కూడా తన కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం లో అదరగొట్టాడట. ఇక కాయదు లోహర్ అయితే తన అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకోవడమే కాకుండా, తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా కడుపుబ్బా నవ్వించేలా చేసిందట. ఓవరాల్ గా వరుస డిజాస్టర్స్ తర్వాత విశ్వక్ సేన్ ఖాతాలో ఒక డీసెంట్ సినిమా పడినట్టుగానే అనిపిస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఈ చిత్రానికి ఇలాంటి టాక్ వస్తుందా లేదా అనేది చూడాలి.