Funky Movie First Review: ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విశ్వక్ సేన్(Viswak Sen) హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఫంకీ'(Funky Movie). ‘జాతి రత్నాలు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. అయితే మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి, మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా కాయదు లోహర్ నటిస్తోంది. ఈమె ‘డ్రాగన్’ చిత్రం ద్వారా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఆ చిత్రం తర్వాత ఆమె చేస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రషెస్ ని మేకర్స్ రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారట. కొంతమంది ప్రముఖ మీడియా ప్రతినిదులు ఈ సినిమా రషెస్ ని చూశారు. వాళ్ళ నుండి వచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చిందని, ఈమధ్య కాలంలో ఇంతటి ఆర్గానిక్ కామెడీని ఏ సినిమాలో కూడా చూడలేదని, అనుదీప్ మార్క్ కామెడీ పంచులు ఒక రేంజ్ లో పేలాయని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో కథ కూడా చాలా బలంగా కుదిరింది అట. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న విశ్వక్ సేన్ కి ఈ చిత్రం మంచి కమర్షియల్ కం బ్యాక్ గా నిలుస్తుందని అంటున్నారు.
విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. మళ్లీ ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా విశ్వక్ సేన్ నుండి రాలేదు. ‘ఫంకీ’ మాత్రం కచ్చితంగా ఆ కోవకు చెందిన సినిమా అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారట మేకర్స్. మరి ఆ రేంజ్ లో ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది చూడాలి. వరుస ఫ్లాప్స్ తర్వాత విశ్వక్ సేన్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఒప్పుకున్న చిత్రమిది. కాబట్టి కమర్షియల్ గా కచ్చితంగా భారీ రేంజ్ లోనే వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం నుండి వచ్చే ప్రతీ కంటెంట్ కూడా అదిరిపోతోంది టాక్.
