
Sapthagiri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో గొప్ప హాస్యనటులు తమకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నారు. అలాంటి ఎందరో హాస్యనటుల్లో తనకంటూ ఓ శైలితో హాస్యనటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సప్తగిరి. పైగా హాస్య నటుడిగానే కాకుండా అటు హీరోగా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు. హీరోగా చేసిన మొదటి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
ఆ సినిమాతో హీరోగా సప్తగిరికి మార్కెట్ కూడా క్రియేట్ అయింది. ఆ తరవాత ‘సప్తగిరి ఎల్ఎల్‌బి’, ‘వజ్రకవచధర గోవింద’ లాంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఒకవైపు కమెడియన్‌గా నటిస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. అయితే, తాజాగా సప్తగిరి ‘ఎయిట్’ అనే మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
పైగా ఇది బహుభాషా చిత్రం కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ నిర్మాత రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు సూర్యస్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ ను నవంబర్ 4న రిలీజ్ చేయబోతున్నారు.
ఐదు భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని టాక్ నడుస్తోంది. కొత్త డైరెక్టర్ సూర్యస్ విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. అన్నిటికి కంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా ఇల్లుజన్ థ్రిల్లర్ ఎయిట్ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.