Tollywood Heroines: సమంత నుంచి శ్రీ లీల వరకు : తొలి చిత్రంతోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ తరం హీరోయిన్స్..

తెలుగులో నాగ శౌర్య ఛలో చిత్రంతో తెరంగేట్రం చేసిన రష్మిక ఆ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాతో కొంచెం క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్, ఆ తరువాత వచ్చిన విజయ దేవరకొండ గీత గోవిందం సినిమా తో ఎనలేని అభిమానుల్ని తెచ్చి పెట్టుకుంది.

Written By: Swathi, Updated On : July 31, 2023 8:13 am

Tollywood Heroines

Follow us on

Tollywood Heroines: ఎవరికైనా తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం చాలా వరకు అసాధ్యం. అయితే కొంతమంది హీరో, హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో నేటితరం చాలామంది హీరోయిన్ ల విషయంలో ఇదే జరిగింది. మొదటి సినిమా తర్వాత వాళ్లకి ఆ హిట్లు కొనసాగాయి లేదా అనేది పక్కన పెడితే, తొలి చిత్రంతోనే హిట్ కొట్టి ఎంతో మంది అభిమానుల్ని, ఎన్నో ఆఫర్ల సొంతం చేసుకున్నారు వీరు. ఇక అలా తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి స్టార్ స్టేటస్ అందుకున్న ఈ తరం హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం…

శ్రీ లీల

ప్రస్తుతం తెలుగు సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్ శ్రీ లీల. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు శ్రీ లీల. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని ఆ తర్వాత తన రెండవ చిత్రం ధమాకా తో సూపర్ హిట్ అందుకుంది. ఇక మొదటి సినిమా నుంచి ఈ హీరోయిన్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు దాదాపు అందరి హీరోల సినిమాలలోనూ ఈ అమ్మాయినే హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమా దగ్గర నుంచి విజయ్ దేవరకొండ నితిన్ సినిమాల వరకు ఈ అమ్మడే హీరోయిన్ గా కనిపించబోతోంది.

కృతి శెట్టి

తన మొదటి సినిమా ఉప్పెన తో మంచి క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి జోడిగా వైష్ణవ్ తేజ్ నటించాడు. అయితే ఉప్పెన తర్వాత వరసగా రెండు హిట్లు అందుకున్న కృతి ఆ తరువాత మాత్రం ఫ్లాపుల బారిన పడింది.

మృణాల్ ఠాకూర్

బాలీవుడ్ లో సీరియల్స్ లో సినిమా లో నటించిన మృణాల్ తెలుగు వారికి పరిచయమైంది మాత్రం సీతారామమ్ సినిమాతో. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలో ఈ హీరోయిన్ని సీతగా మిగిల్చింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అవకాశాల మీద అవకాశాలు సంపాదించుకుంటూ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లకు కూడా మంచి పోటీ ఇస్తుంది.

రష్మిక మందాన

తెలుగులో నాగ శౌర్య ఛలో చిత్రంతో తెరంగేట్రం చేసిన రష్మిక ఆ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాతో కొంచెం క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్, ఆ తరువాత వచ్చిన విజయ దేవరకొండ గీత గోవిందం సినిమా తో ఎనలేని అభిమానుల్ని తెచ్చి పెట్టుకుంది. ఇక ఆ తర్వాత నుంచి తెలుగులో తను స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మిక.

సమంత

మొదటి సినిమాతోనే అమితమైన క్రేజ్ సంపాదించుకున్న నేటి తరం హీరోయిన్ల గురించి చెప్పాలి అంటే మొదట సమంత పేరే చెప్పాలి. తన మొదటి సినిమా ఏ మాయ చేసావే తో నిజంగానే మాయ చేసేసింది సమంత. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జెస్సీ అనే రోల్ చేసి యువతను అంతా తన వైపు మళ్ళీంచుకుంది ఈ హీరోయిన్. ఆ తరువాత నుంచి విభిన్న పాత్రలు ఎంచుకొని లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోంది.

ఆర్తి అగర్వాల్

దివంగత నటి ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మొదటి చిత్రం నువ్వు నాకు నచ్చావ్ ఇప్పటికీ మనం టీవీలో ఎన్నిసార్లు వేసిన చూస్తూనే ఉంటాం. ఈ సినిమా తో ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్ అయింది. కేవలం ఒక్క సినిమాతోనే అంత క్రేజ్ సంపాదించుకున్న అతి కొద్దిమంది నటుల్లో ఆర్తి అగర్వాల్ ముందంజలో ఉంటారు.