Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: ఇక నుండి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ అన్నీ విజయవాడలోనే..!

Pawan Kalyan: ఇక నుండి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ అన్నీ విజయవాడలోనే..!

ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్ రావాలంటే కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ చేసి ఉండాలి అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక రూల్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ మొత్తం ఇక్కడే జరుగుతాయి కాబట్టి ఆయన సినిమాలకు టికెట్ హైక్ ఆశించవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Pawan Kalyan: ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు అంటూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలు మరియు రాజకీయాలు అనేది రెండు వేర్వేరు సమాసముద్రలు వంటివి. రెండిటినీ ఒకేసారి మ్యానేజ్ చెయ్యడం చాలా కష్టం. అందుకే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వస్తుంటారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు జరిగింది ఇదే.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రెండిటినీ సమర్ధవతంగా బ్యాలన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ‘బ్రో ది అవతార్’ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం OG , ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు వంటి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు #OG మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జూన్ 14 వ తారీఖు నుండి వారాహి యాత్రలో ఫుల్ బిజీ కాబోతున్నాడు.

ఈ యాత్ర ప్రారంభం అయ్యే ముందే ఆయన ఒక మహా యాగాన్ని నిర్వహించాడు. ఈ యాగం రెండు రోజుల పాటు జరగనుంది, నిన్న జరిగిన యాగానికి పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలందరూ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని సందర్శించి, ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వాలని శుభాకాంక్షలు తెలియచేసారు. అంతే కాకుండా జూన్ 14 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ జనాల్లోనే ఉండబోతున్నాడు కాబట్టి, ఇక నుండి మా సినిమా షూటింగ్స్ అన్నీ విజయవాడ మరియు గుంటూరు పరిసరాల్లోనే నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు.

ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్ రావాలంటే కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ చేసి ఉండాలి అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక రూల్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ మొత్తం ఇక్కడే జరుగుతాయి కాబట్టి ఆయన సినిమాలకు టికెట్ హైక్ ఆశించవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper