https://oktelugu.com/

RGV and Nagababu: ఓహో.. వర్మ – నాగబాబు మధ్య స్నేహం కుదిరింది !

RGV and Nagababu: వివాదాల దర్శకుడు ‘రామ్ గోపాల్ వర్మ’ చేసే వివాదాస్పద కామెంట్స్ అంటే.. మెగా బ్రదర్ నాగబాబుకి అస్సలు నచ్చదు. వర్మ పిచ్చి డైరెక్టర్ అంటూ, అలాగే వర్మ పెద్ద సొల్లు గాడు అంటూ నాగబాబు గతంలో బోలెడు తిట్లు తిట్టి తెగ సీరియస్ అవుతూ.. వర్మకు పలు వార్నింగ్ లు కూడా ఇచ్చాడు. పైగా వర్మ పేరు వినగానే నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. అలాంటి నాగబాబు ఇప్పుడు అదే వర్మకి సపోర్ట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 5, 2022 / 11:46 AM IST
    Follow us on

    RGV and Nagababu: వివాదాల దర్శకుడు ‘రామ్ గోపాల్ వర్మ’ చేసే వివాదాస్పద కామెంట్స్ అంటే.. మెగా బ్రదర్ నాగబాబుకి అస్సలు నచ్చదు. వర్మ పిచ్చి డైరెక్టర్ అంటూ, అలాగే వర్మ పెద్ద సొల్లు గాడు అంటూ నాగబాబు గతంలో బోలెడు తిట్లు తిట్టి తెగ సీరియస్ అవుతూ.. వర్మకు పలు వార్నింగ్ లు కూడా ఇచ్చాడు. పైగా వర్మ పేరు వినగానే నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసేవాడు.

    RGV and Nagababu

    అలాంటి నాగబాబు ఇప్పుడు అదే వర్మకి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చాడు. ఇది చూశాక, ఓ మాట గుర్తుకు వస్తోంది. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా ఇక నుంచి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని మనం ఒక తీర్మానం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ట్విట్టర్ వేదికగా వర్మ, నాగబాబు ఒకరిపై ఒకరు ఘోరమైన కామెంట్స్ చేసుకున్నారు.

    నాగబాబు మెగా బ్రదర్ కాదు, మెగా పారసైట్ అని వర్మ అంటే.. వర్మ పెద్ద అక్కుపక్షి అని నాగబాబు అన్నాడు. ఇంతకంటే ఒకర్ని ఒకరు దారుణంగా అవమానించుకున్నారు. మరి అవమానాలు మర్చిపోయారేమో, ఇప్పుడు వర్మకి సపోర్ట్ గా వచ్చాడు నాగబాబు. ప్రస్తుతం వర్మ జగన్ రెడ్డి పార్టీ తీసుకున్న టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం పై యుద్దానికి కాలు దువ్వాడు.

    Also Read: అరెరే.. వర్మ పూర్తిగా మారిపోయాడే !

    ‘జగన్ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు’ అంటూ రోజూ ఏదొక వీడియోను రిలీజ్ చేస్తూ బాగా హడావిడి చేస్తున్నాడు. వర్మ దెబ్బకు జగన్ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే, వర్మ ట్వీట్లను, వీడియోని చూసి నాగబాబు తెగ మెచ్చుకున్నాడు. తాను ప్రశ్నించాలని అనుకున్న వాటిని వర్మ సూటిగా ప్రశ్నించాడు అంటూ నాగబాబు తెగ ఎగ్జైట్ అయిపోతూ వర్మని బాగా అభినంధిస్తున్నాడు.

    మొత్తమ్మీద వర్మ -నాగబాబు మధ్య టికెట్ తగ్గింపు ధరల కారణంగా స్నేహం కుదిరింది. కానీ, ఈ ఇద్దరి విషయంలో ఓ అపవాదు బలంగా ఉంది. వర్మ ఎప్పుడు ఎవరి వైపు ఉంటాడో వర్మకే తెలియదు అని, ఇక నాగబాబు కూడా ఎప్పుడు ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు అని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి ఇద్దరూ ఇద్దరే.

    Also Read: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అంటున్న ఆర్జీవీ… టార్గెట్ అతనేనా ?

    Tags