ఫ్రీడా పింటో.. ఈ పేరు గుర్తుందా ?, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో నటించి అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది ఈ ఫ్రీడా పింటో. ఐతే ఆ సినిమాతో ఫుల్ పాపులారిటీని సాధించినా కాలక్రమేణా ఆమె తన మార్కెట్ విలువను నిలబెట్టుకోలేకపోయింది. అయితే, ప్రజెంట్ మ్యాటర్ లోకి వెళ్తే.. ఫ్రీడా పింటో ఇప్పుడు తల్లి కాబోతుంది.
అవును, ఇది రూమర్ కాదు, ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ “బేబీ ట్రాన్ రాక ఈ ఫాల్ కి” అంటూ ఆమె తన గర్భంతో కూడిన ఫోటోని తన ఫాలోవర్స్ కోసం షేర్ చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు.
అందుకే తన గర్భానికి కారణమైన వ్యక్తిని కూడా పనిలో పనిగా ఇప్పుడే పరిచయం చేసింది. ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలోనే ఆమె ప్రియుడి ఏమి తెలియని అమాయకుడిలా నవ్వుతూ కనిపించాడు. మొత్తానికి తన గర్భంతో పాటు తనకు కాబోయే భర్త కోరి ట్రాన్ కూడా పరిచయం చేయడం ఫ్రీడా పింటోకి మాత్రమే చెల్లింది.
అన్నట్టు ట్రాన్, ఫ్రీడా పింటో చాలా కాలంగా అమెరికాలో సహజీవనం చేస్తూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవల వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కాకపోతే పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. కానీ డెలివరీ డేట్ ఫిక్స్ అయింది. ఈ వింటర్లో ఫ్రీడో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.