మిల్కీ బ్యూటీ తమన్నాకు ఈ నాలుగు నెలలు చాలా కీలకం. ఎందుకంటే రానున్న మూడు నెలల్లో తమన్నా (Tamannah) నుండి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిల్లో కాస్త అంచనాలు ఉన్న సినిమా గోపీచంద్ ‘సీటిమార్’. తమన్నా (Tamannah) హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమా వచ్చేనెల సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
అలాగే, తమన్నా బోల్డ్ పాత్రలో నటిస్తోన్న మరో సినిమా నితిన్ హీరోగా వస్తోన్న ‘మాస్ట్రో’. కాగా ఈ సినిమాలో తమన్నా కెరీర్ లో మొదటిసారి విలన్ పాత్రలో నటిస్తోంది. అయితే, ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కావడం లేదు. డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు.
అయితే, డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్లో మొదటి వారంలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందని మేకర్స్ నుండి ఒక సమాచారం ఉంది. తమన్నా హీరోయిన్ గా నటించిన మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాలో తమన్నాదే కీలక పాత్ర. పైగా ఈ సినిమాలో చిన్న హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు.
కాబట్టి, ఈ సినిమా మొత్తం తమన్నా మార్కెట్ పైనే ఎక్కువ ఆధారపడనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ వ్యవహారానికి వస్తే.. నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న ‘గని’ సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లాంటి ఐటెం సాంగ్ కూడా చేసింది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.
ఇక ఎలాగూ ఆగస్టులో తమన్నా హోస్ట్ చేస్తున్న తొలి టీవీ షో ‘మాస్టర్ చెఫ్’ కూడా ప్రసారం కానుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Four best films of tamannah bhatia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com