Nagarjuna: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీసన్ ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికే 5 సీసన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇటీవలే బిగ్ బాస్ OTT వర్షన్ సీసన్ కూడా పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సీసన్ టైటిల్ విన్నర్ గా బిందు మాదవి నిలవగా,రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు..ఈ సీసన్ పూర్తి అవ్వడం తో టెలివిజన్ కి సంబంధించిన ఆరవ సీసన్ అతి త్వరలోనే టెలికాస్ట్ అవ్వబోతుంది..దీనికి సంబంధించిన టీజర్ ని కూడా ఇటీవలే విడుదల చేసారు స్టార్ మా ఛానల్..అన్ని సీసన్స్ లాగ కాకుండా ఈ సీసన్ లో సామాన్యులకు కూడా ఈ షో లో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం కలిపిస్తుంది బిగ్ బాస్ టీం..గతం లో బిగ్ బాస్ 2 లో కూడా గణేష్, నూతన నాయుడు మరియు సంజన వంటి కామన్ పెఒప్లె కి అవకాశం కలిపించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగమే చేయబోతుంది బిగ్ బాస్ టీం.
Also Read: NTR Movie Postponed: మరోసారి వాయుదా పడిన ఎన్టీఆర్ సినిమా.. ఆగ్రహం లో ఫాన్స్
ఇది ఇలా ఉండగా ఇక నుండి నేను యాంకర్ గా ఉండబోవట్లేదు అని అక్కినేని నాగార్జున అధికారికంగా తెలియచేసిన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి సీసన్ జూనియర్ ఎన్టీఆర్ చెయ్యగా , రెండవ సీసన్ ని న్యాచురల్ స్టార్ నాని చేసాడు..ఇక మూడవ సీసన్ నుండి మొన్న వచ్చిన OTT సీసన్ వరుకు నాలుగు సీసన్స్ కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు..ఇప్పుడు నాకు కాస్త బ్రేక్ కావాలి అని చెప్పడం తో బిగ్ బాస్ టీం నాగార్జున గారి మాజీ కోడలి, టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత ని వ్యాఖ్యాతగా తీసుకునే ఆలోచనలో ఉంది అట బిగ్ బాస్ టీం..ఇప్పటికే సమంత తో ఈ విషయం పై సంప్రదించగా, ఆమె కూడా ఈ సరికొత్త సీసన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది..తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కూడా సమంత ‘ కమింగ్ సూన్ ‘ అని పరోక్షంగా బిగ్ బాస్ షో గురించి హింట్ ఇచ్చింది..గతం లో ఆమె నాగార్జున అందుబాటులో లేనప్పుడు ఆయనకీ బదులుగా ఒక్క ఎపిసోడ్ కి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించింది..అప్పటికి ఆమె చైతన్య తో విడిపోలేదు..ఇప్పుడు విడిపోయిన తర్వాత మళ్ళీ తన మామ గారు చేసే రియాలిటీ షో ని తీసుకోవడం ఆసక్తికరమైన విషయం..చూడాలి మరి సమంత బిగ్ బాస్ వ్యాఖ్యాతగా తన మాజీ మామ ని మరిపిస్తుందో లేదో అనేది.
Also Read: Pavan Kalyan Shocked About KK Death: స్టార్ సింగర్ కెకె మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి
Recommended Videos