https://oktelugu.com/

Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ నిశ్చితార్థం..వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Poorna Engagement: ఈటీవీలో ప్రసారమైన ఢీ షో ద్వారా జడ్జిగా అందరికీ సుపరిచితమైన హీరోయిన్ పూర్ణ సడెన్ గా షాక్ ఇచ్చింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిన పూర్ణ అవకాశాలు తగ్గడంతో ఈటీవీ డ్యాన్స్ షో జడ్జీగా వచ్చింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ పై ప్రేమను ఒలకబోసేది. ఒకానొక సమయంలో ప్రదీప్-పూర్ణ పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు వచ్చాయి. వాటన్నింటికి తెరదించుతూ పూర్ణ తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవడం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2022 / 04:22 PM IST
    Follow us on

    Poorna Engagement: ఈటీవీలో ప్రసారమైన ఢీ షో ద్వారా జడ్జిగా అందరికీ సుపరిచితమైన హీరోయిన్ పూర్ణ సడెన్ గా షాక్ ఇచ్చింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిన పూర్ణ అవకాశాలు తగ్గడంతో ఈటీవీ డ్యాన్స్ షో జడ్జీగా వచ్చింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ పై ప్రేమను ఒలకబోసేది. ఒకానొక సమయంలో ప్రదీప్-పూర్ణ పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు వచ్చాయి. వాటన్నింటికి తెరదించుతూ పూర్ణ తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం.

    2007లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా వచ్చిన ‘మహాలక్ష్మీ’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. ఈ సినిమా తర్వాత అల్లరి నరేశ్ హీరోగా ‘సీమ టపాకాయ్’తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో ‘అవును’, అవును2 హర్రర్ సినిమాల్లో నటించి మెప్పించింది.

    పూర్ణ పెళ్లిచేసుకోబోయే వ్యక్తి ఇతడే

    కొంతకాలంగా హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో టీవీషోల్లో పూర్ణ మెరుస్తోంది. ఢీ డ్యాన్స్ షో జడ్జీగా వ్యవహరిస్తూ తెలుగునాట ఫేమస్ అయ్యింది. స్వతహాగా కథక్ డ్యాన్సర్ అయిన పూర్ణ అప్పుడప్పుడూ షోలో తన డ్యాన్స్ తో సత్తా చాటుతోంది.

    ఇటీవల ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన పూర్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా ఆమె ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. తనకు కాబోయే భర్తను పరిశయం చేసింది. ఈ మేరకు కాబోయే భర్తతో ఫొటోలను షేర్ చేసింది.

    ఢీ షోలో పూర్ణ

    పూర్ణకు కాబోయే భర్త పేరు ‘సానిద్ ఆసిఫ్ అలీ’. ఇతడు జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ అని సమాచారం. బడా వ్యాపారవేత్తతో పూర్ణకు పెళ్లి సంబంధం సెట్ అయ్యింది. సహజంగా సినీ ఇండస్ట్రీకి సంబంధమున్న వ్యక్తులనే హీరోయిన్లు పెళ్లాడుతారు. లేదంటే పారిశ్రామికవేత్తలకు భార్యలు అయిపోతారు. పూర్ణ రెండోదారి ఎంచుకుంది. పెళ్లి తర్వాత పూర్ణ సినిమాలు, టీవీషోలకు గుడ్ బై చెబుతుందో లేదో చూడాలి.