CM YS Jagan : 2019 సార్వత్రిక ఎన్నికలలో 175 కి 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని, ముఖ్య మంత్రి స్థానంలో కూర్చొని సంచలనం సృష్టించిన మాజీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సొంతం చేసుకోలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంత దారుణమైన పరాజయం జగన్ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ పరాభవం ని తట్టుకోలేక ఆయన అసెంబ్లీ కి కూడా రాకుండా ఉంటున్న విషయాన్నీ మనమంతా గమనిస్తూనే ఉన్నాం. మొదటిరోజు ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే ఆయన వచ్చాడు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం రోజున అతనితో పాటు, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి పెద్ద రచ్చ చేసి వెళ్లిపోయారు. మళ్ళీ ఇన్ని రోజులైనా అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు జగన్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ మొండికేసాడు జగన్.
రాజ్యాంగ బద్దంగా ప్రతిపక్ష హోదా దక్కాలంటే కచ్చితంగా 18 సీట్లు వచ్చి ఉండాలి, అందుకే ఆయనకీ ప్రతిపక్ష హోదా ని ఇచ్చేందుకు నిరాకరించారు అసెంబ్లీ స్పీకర్. అసెంబ్లీ లో తనకి మైక్ ఇవ్వరని, సమావేశాలు జరిగిన రోజున, ప్రతీ అంశానికి సమాధానం ఇస్తూ, నేను ప్రెస్ మీట్ ద్వారా మీ ముందుకొస్తానని జగన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ పార్టీ రోజురోజుకి ప్రజాక్షేత్రం లో బలహీన పడుతుంది. నాయకులందరూ చెల్లాచెదురు అయిపోతున్నారు. పార్టీ కి మొదటి నుండి పట్టుకొమ్మలు లాగా ఉంటూ వచ్చిన ఎంతో మంది ముఖ్య నాయకులూ వీడిపోతున్నారు. అసెంబ్లీ లో ప్రజా సమస్యలపై జగన్ గళం వినిపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం పై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుంది. ఇదంతా గమనించిన జగన్ అసెంబ్లీ సమావేశాలకు ఇక నుండి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
త్వరలో జరగబోయే శీతాకాలం అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాబోతున్నాడు. ప్రస్తుతం అసెంబ్లీ కి స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ గా రఘు రామ కృష్ణంరాజు ఉంటున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాలు మొత్తం రఘు రామ కృష్ణం రాజు అద్యక్షతనే జరిగింది. అసెంబ్లీ లో ప్రతిపక్షం లేక సమావేశాలు చూసేవారికి ఎంత బోర్ కొడుతున్నాయో మనమంతా చూసాము. చంద్రబాబు, జగన్ గతం లో ఎన్నోసార్లు అసెంబ్లీ వాదోపవాదనలు వేసుకున్న సందర్భాలు మనమంతా చూసాము. కానీ పవన్ కళ్యాణ్, జగన్ మధ్య వాదనలు ఇప్పటి వరకు చూడలేదు. వీళ్లిద్దరు కలిసి ఒకే వేదికని పంచుకోవడం ఇప్పటి వరకు జనాలు చూడలేదు. వీళ్లిద్దరు రఘు రామ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగే సమావేశాలు, ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటే ఎలా ఉంటుందో అతి త్వరలోనే మనమంతా చూడబోతున్నాము. ఇక నుండి అసెంబ్లీ సమావేశాలు చాలా ఫైర్ మీద ఉండబోతున్నాయి.