Rajinikanth – Jayalalitha : తమిళ రాజకీయాల్లో ఎంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుల్లో ప్రథమ స్థానంలో ఉంటారు జయలలిత. రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా జయలలితాకి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎన్నో సినిమాలలో చేసి సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ నటి.
ఇక ఆ తరువాత సినిమాలను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా నెంబర్ వన్ అనిపించుకుంది. అయితే జయలలిత ఒకప్పుడు 1980లో రజినీకాంత్ గురించి ప్రస్తావిస్తూ రాసిన లేఖ, ప్రస్తుతం ఆమె మరణించి ఎన్నో సంవత్సరాలు తరువాత వైరల్ అవుతోంది.
ఆ లెటర్ 1980లో వచ్చిన ఒక్క తప్పుడు వార్తకు సమాధానంగా జయలలిత రాసిన లేఖ అని తెలుస్తోంది. 1980 సమయానికి జయలలిత సినిమాలు మానేసి రాజకీయాల వైపు వెళ్లారు. కానీ ఒక మ్యాగజైన్ లో మాత్రం జయలలిత తీవ్రంగా సినిమాలలో నటించడానికి ప్రయత్నిస్తోంది అని వార్త ప్రచురితమైందట.
ఇక దానికి సమాధానం, ఆ లేఖలో తాను సినిమాలలో నటించడానికి ప్రయత్నించదంలేదని, అది నిజం కాదని చెబుతూ తాను రజినీకాంత్ ఆఫర్ కూడా వదులుకున్నానని రాయడం విశేషం. 1980లో రిలీజ్ అయిన రజినీకాంత్ సూపర్ హిట్ సినిమా ‘బిల్లా’ లో తనకు ఆఫర్ వచ్చిందని, అది కూడా దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న బాలాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన మూవీ అని. అయినా కానీ తాను ఆ ఆఫర్ వదులుకున్నానని తెలియజేసింది.తాను సినిమాలలో నటించాలనుకుంటే రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ ను వదులుకునేదాన్ని కాదు అని ఆ మ్యాగ్జైన్ వారికి క్లారిటీ ఇచ్చింది జయలలిత. అంతేకాదు తాను ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అవకాశాన్ని శ్రీ ప్రియకు బాలాజీ ప్రొడక్షన్స్ ఇచ్చిందని ఆ లెటర్ లో జయలలిత వివరించారు.
ఈ విషయాన్ని బాలాజీ కూడా పబ్లిక్ గానే చెప్పారని, కానీ మీడియా వారికి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదని, భగవంతుడి దయ వల్ల ఆర్థికంగా తనకి ఎలాంటి కష్టాలు లేవని ఈ లేఖ ద్వారా చెప్పుకొచ్చింది. మొత్తానికి జయలలిత రాసిన అప్పుడు లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.