Winston Churchill: మనం దారి వెంట వెళ్తూ ఉంటాం.. ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురై కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ప్రస్తుత కాలంలో చాలామంది వారి ఫోటోలను తీస్తారు.. గుంపుగా చేరి ఎలా జరిగింది? అని చర్చించుకుంటారు. కానీ ఆ వ్యక్తికి సాయం చేయడానికి మాత్రం ముందుకు రారు. సాయం చేయబోతే ఏం జరుగుతుందో? అన్న భయం కొందరిలో ఉంటుంది. అయితే మనం ఒకరికి చేసిన సాయం మన పిల్లలకు వర్తిస్తుంది అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. దీనిని చాలామంది పట్టించుకోరు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది.. అని చెబుతూ ఉంటారు. అయితే పెద్దలు చేసిన సాయం పిల్లలకు పుణ్యం వస్తుందని మనదేశంలోనే కాదు బ్రిటన్ లో కూడా నిరూపణ అయింది. ఇద్దరు యోధుల తండ్రులు చేసిన సహాయం తమ పిల్లలకు వర్తించింది అని ఈ స్టోరీని చదివితే అర్థమవుతుంది. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒక పిల్లవాడు ఆడుకుంటూ వెళ్తూ బావిలో పెడతాడు. ఆ బావిలో నుంచి పిల్లాడి అరుపులు విన్న ఒక రైతు అక్కడికి వస్తాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బావిలోకి దూకి పిల్లాడిని కాపాడుతాడు. పిల్లాడిని బయటకు తీసి కడుపులో నుంచి నీరును కక్కించి పడుకోబెడతాడు. ఆ పిల్లవాడు నిద్రలేచేసరికి చీకటి పడుతుంది. దీంతో ఆ వ్యక్తి మర్నాడు ఉదయం వెళ్లొచ్చు అని చెప్పి నిద్రపుచ్చుతాడు. అయితే తెల్లవారేసరికి ఒక పెద్ద కారు వచ్చి ఇంటిముందు ఆగుతుంది. ఆ కారులో నుంచి ఒక ధనవంతుడు బయటకు వచ్చి మీరు ఒక పిల్లవాడిని కాపాడాలని విన్నాను.. ఆ పిల్లవాడు మా కొడుకు అని చెబుతాడు. ఇందుకు ప్రతిఫలంగా కాపాడిన వ్యక్తికి ధనవంతుడు కొన్ని డబ్బులను ఇస్తాడు. అయితే ఆ డబ్బులను అతడు తీసుకోడు. ఒక మనిషికి సహాయం చేయడం నా ధర్మం.. నాకు డబ్బులు అవసరం లేదు అని అంటాడు.
అయితే అప్పుడే ఆ వ్యక్తి ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లవాడు బయటకు వస్తాడు. అతడిని చూసి ధనవంతుడు ఇలా అంటాడు.. ఈ పిల్లవాడు ఎవరు? అని అడగగా.. నా కుమారుడే అని కాపాడిన వ్యక్తి చెబుతాడు. అతడు చదువు లేక ఇక్కడే ఉంటున్నాడు అని చెబుతాడు. అతడి చదువు కోసం నా దగ్గర డబ్బు లేదని అంటాడు. దీంతో ఆ ధనవంతుడు.. ఈ పిల్లవాడిని నేను చదివిపిస్తా అని తన వెంట తీసుకెళ్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత వారు పెరిగి పెద్దవారై మంచి పొజిషన్లోకి వెళ్తారు. అయితే ఒక రోజు వీరిలో ధనవంతుడి కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతాడు. అలా బాధపడిన వ్యక్తి పేరు Winston Charchil. ఈయన ఎవరో కాదు బ్రిటన్ ప్రధానమంత్రి. అయితే ఈయనకు వచ్చినా అనారోగ్యానికి ఎక్కడ మందు లభించదు. దీంతో ఒక వ్యక్తి పెన్సిలిన్ అనే మందును కనుగొని ఇతనికి న్యాయం చేస్తాడు. ఆ పెన్సిలిన్ కనుగొన్న వ్యక్తి Alexander flemy.
ఇక్కడ బ్రిటన్ ప్రధానమంత్రి Winston Charchil ధనవంతుడి కుమారుడు అయితే..Alexander flemy పేదవాడి కుమారుడు. అంటే రైతు కుమారుడిని చదివించిన ధనవంతుడికి.. తన కుమారుడు అయిన బ్రిటన్ ప్రధానమంత్రి Winston Charchil ఆరోగ్యాన్ని నయం చేశాడు. అటు ధనవంతుడి కుమారుడికి సహాయం చేసినందుకు తన కుమారుడు ఒక పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు. ఇలా తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు, పాపాలు పిల్లలకు చెందుతాయని అంటారు.