Homeఎంటర్టైన్మెంట్ఇప్పటికీ ఎప్పటికీ మహానటి ఒక్కరే !

ఇప్పటికీ ఎప్పటికీ మహానటి ఒక్కరే !

Mahanati Savitri
నేడు మహానటి సావిత్రి జయంతి సందర్భంగా ఆ మహానటి గురించి కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. సావిత్రిగారి నటనా కౌశలం గురించి ఇప్పుడు కొత్తగా వర్ణించక్కర్లేదు. అయితే ఆమె సినీ ప్రయాణం గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటే.. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మొదలైన సావిత్రిగారి సినీ ప్రయాణం ఆ తరువాత వరుసగా ఇవి సావిత్రి మాత్రమే చేయగలదు అనే పాత్రలు ఎన్నో చేశారు ఆ మహానటి. మిస్సమ్మ, మధురవాణి, శశిరేఖ ఇలా తన నటనతో ఆమె జీవం పోసిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత్రలన్నీ ఎప్పటికీ జీవించే ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ మహానటి అంటే ఆమె ఒక్కరే.

Also Read: కొమ్మారెడ్డి సావిత్రి.. అందుకే మహానటీమణి అయింది !

ముఖ్యంగా తెలుగు చలన చిత్ర చరిత్ర గురించి ప్రస్తావిస్తే అందులో మాయబజార్‌ గురించి చెప్పకుండా వుండలేం అంటే.. దానికి కారణం సావిత్రి అభినయమే. అలాంటి అద్బుతమైన చిత్రంలో కథ మొత్తం సావిత్రి పాత్ర చుట్టే తిరుగుతుంది అంటేనే.. హీరోలకి ఆమె ఎంతగా పోటీ ఇచ్చిందో ఉహించొచ్చు. ఆ సినిమాలో పెళ్లి సన్నివేశంలో శశిరేఖగా వచ్చిన ఘటోత్కచుని చూపించే సమయంలో ఒకేసారి తనలోని లావణ్యంతో పాటు ఎస్వీఆర్‌ లాంటి నటుని గాంభీర్యాన్ని కూడా తన ఆహార్యంలో పలికించి వహ్వా అనిపించగలిగిన నటి కాబట్టే.. సావిత్రి మహానటి అయ్యారు.

మొదట ఆ పాత్రను సావిత్రి చేయలేదేమో అని ముందు అభిప్రాయపడ్డారట నాగిరెడ్డి. కానీ అప్పటికి సావిత్రినే గొప్పనటి. ఇక ఆమెనే ఆ పాత్ర కోసం తీసుకున్నారు. కానీ ఆ సినిమాలో ఆమె నటనకు నాగిరెడ్డి, ఆమె అభిమానిగా మారిపోయారట. ఏమైనా దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా శాశ్వితంగా నిలిచిపోయిన మహానటి ఒక్క సావిత్రినే. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా… సావిత్రి ఒక అధ్యాయాన్ని సృష్టించారు.

Also Read: ప్రభాస్ సినిమా పై సైఫ్ అలీ ఖాన్ క్రేజీ కామెంట్స్ !

1968లో చిన్నారిపాపలు అనే సినిమాకు సావిత్రి దర్శకత్వం వహించారు. దక్షణ భారత దేశంలోనే తొలిసారిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో ఈ మూవీ స్థానం దక్కించుకుంది అంటే.. ఆ ఘనత మహానటి సావిత్రిదే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular