సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న లైఫ్ స్పాన్ హీరోయిన్లకు ఉండదు. ఫుల్ సక్సెస్ సాధించిన హీరోయిన్లు కూడా మహా అయితే పదేళ్ల పాటు లైమ్ లైట్ లో ఉండే అవకాశం ఉంది. అది కూడా స్టార్ హీరోలు దర్శకులితో మెయింటైన్ చేసే సాన్నిహిత్యాన్ని బట్టే ఆధార పడి ఉంటుంది. హీరోయిన్లకు చాలా రేర్ గా 15 ఏళ్లకు పైగా కెరీర్ ఉంటుంది. కానీ బంగారం అమ్మిన చోటే చింతకాయలు అమ్ముకోవాల్సి ఉంటుంది.
ఏది ఏమైనా హీరోయిన్ గా లాంగ్ లైఫ్ అనేది అసాధ్యమే. దీనికితోడు ఎప్పటికప్పుడు కొత్త తరం హీరోయిన్లు భారీ గ్లామర్ తో ఇండస్ట్రీ పై అందాల దాడికి దిగుతారు. దాంతో ఆల్రెడీ పోటీలో ఉన్న హీరోయిన్ల సోయగాల పై కుర్రకారుకి ఇంట్రెస్ట్ పోతుంది. ఆయా హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుంది. అయినా కొత్త నీరు వచినప్పుడు పాత నీరు కొట్టుకు పోవాల్సిందే, ఇదే పకృతి నియమం.
కాబట్టి గ్లామర్ ప్రపంచంలో పాత సొగసులకు ఎపుడైనా డిమాండ్ తక్కువే. అందుకే, ఎక్స్ పోజింగ్ విషయంలో పరిధులు దాటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసినా హీరోయిన్లు పెద్దగా సంపాదించుకో లేకపోతున్నారట. అయితే ఇప్పుడు అలాంటి హీరోయిన్లకు ఓటీటీలు అనేవి గొప్ప వరంలా మారాయి. ప్రస్తుతం డిజిటల్ మీడియా బూమ్ లో ఉంది కాబట్టి, హీరోయిన్లకు అదనపు ఆదాయానికి మార్గం దొరికినట్టు అయింది.
వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్ లకు బాగా డిమాండ్ క్రియేట్ అవ్వడంతో కాస్త ఫేడ్ అవుట్ దశలో ఉన్న భామలు కొన్నాళ్ళు పాటు ఓటీటీ చిత్రాలతో నాలుగు రాళ్లు సంపాధించుకునే అవకాశం లభించినట్టు అయింది. మొత్తానికి హీరోయిన్లకు ఓటీటీ బాగా ప్లస్ గా మారాయి.