spot_img
Homeఎంటర్టైన్మెంట్పవన్ రెండు పడవల ప్రయాణం.. ఏది బెస్ట్?

పవన్ రెండు పడవల ప్రయాణం.. ఏది బెస్ట్?

Pawan Kalyan
తెలుగు సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ‘పవన్ కళ్యాణ్’ వకీల్ సాబ్ ప్రభంజనమే కనిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని.. ముఖ్యంగా రిలీజ్ విషయంలో కూడా పవన్ చాల ప్లాన్ చేశారని.. ఈ సినిమా నిర్మాత ‘దిల్ రాజు’నే తాజాగా ఒక ఫ్యాన్స్ మీట్ లో సగర్వంగా చాటి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది.

సోషల్ మీడియాలో పవన్ పై చాల రకాలుగా విమర్శలు వస్తున్నాయి. పవన్ కి సినిమాల్లో నటించడం మీదా, వాటి ప్రమోషన్స్‌ మీదా వున్న శ్రద్ధలో పదో వంతు కూడా రాజకీయాల మీద లేదు అని, తన పార్టీకి అన్నీ తానే అయి వ్యవహరించాలని పవన్ అనుకోవడానికి కూడా, ఆయనలోని సినిమా హీరోనే కారణం అని.. అసలు పవన్ కి సినిమాలే బెటర్ అని.. కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే విచిత్రంగా పవన్ రాజకీయ ఫాలోవర్స్ లో కూడా కొంతమంది పవన్ పై విమర్శలు చేయడం నిజంగా షాకింగే. పవన్ కళ్యాణ్ దురదృష్టవశాత్తూ సినిమాల్ని తీసుకున్నంత సీరియస్ గా రాజకీయాల్ని ఎన్నడూ సీరియస్‌గా తీసుకోవడంలేదనిపిస్తోంది అని.. మైక్ దొరికినప్పుడు మాత్రం రాజకీయాల సీరియస్ గా మాట్లాడతారు అని, అంతే గానీ ఆయన ఒక పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదని.. నిఖార్సైన జనసైనుకులే వాపోతున్నారు.

అయినా, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ హిట్ తో ఇంకా సినిమాల్లో యాక్టివ్‌ అయితే.. ఇప్పుడున్న రాజకీయాల సెగ నుంచి ఆయన తట్టుకోవడం అంత తేలిక అయినా పని కాదు అని.. రాజకీయాలు అంటే సినిమాల్లో డైలాగులు చెప్పినంత తేలిక కాదు అని పవన్ అర్ధం చేసుకుంటే మంచిది కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ కి సినిమాలే బెస్ట్ రాజకీయాలు వేస్ట్ అంటున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper