
తెలుగు సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ‘పవన్ కళ్యాణ్’ వకీల్ సాబ్ ప్రభంజనమే కనిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని.. ముఖ్యంగా రిలీజ్ విషయంలో కూడా పవన్ చాల ప్లాన్ చేశారని.. ఈ సినిమా నిర్మాత ‘దిల్ రాజు’నే తాజాగా ఒక ఫ్యాన్స్ మీట్ లో సగర్వంగా చాటి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది.
సోషల్ మీడియాలో పవన్ పై చాల రకాలుగా విమర్శలు వస్తున్నాయి. పవన్ కి సినిమాల్లో నటించడం మీదా, వాటి ప్రమోషన్స్ మీదా వున్న శ్రద్ధలో పదో వంతు కూడా రాజకీయాల మీద లేదు అని, తన పార్టీకి అన్నీ తానే అయి వ్యవహరించాలని పవన్ అనుకోవడానికి కూడా, ఆయనలోని సినిమా హీరోనే కారణం అని.. అసలు పవన్ కి సినిమాలే బెటర్ అని.. కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే విచిత్రంగా పవన్ రాజకీయ ఫాలోవర్స్ లో కూడా కొంతమంది పవన్ పై విమర్శలు చేయడం నిజంగా షాకింగే. పవన్ కళ్యాణ్ దురదృష్టవశాత్తూ సినిమాల్ని తీసుకున్నంత సీరియస్ గా రాజకీయాల్ని ఎన్నడూ సీరియస్‌గా తీసుకోవడంలేదనిపిస్తోంది అని.. మైక్ దొరికినప్పుడు మాత్రం రాజకీయాల సీరియస్ గా మాట్లాడతారు అని, అంతే గానీ ఆయన ఒక పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదని.. నిఖార్సైన జనసైనుకులే వాపోతున్నారు.
అయినా, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ హిట్ తో ఇంకా సినిమాల్లో యాక్టివ్ అయితే.. ఇప్పుడున్న రాజకీయాల సెగ నుంచి ఆయన తట్టుకోవడం అంత తేలిక అయినా పని కాదు అని.. రాజకీయాలు అంటే సినిమాల్లో డైలాగులు చెప్పినంత తేలిక కాదు అని పవన్ అర్ధం చేసుకుంటే మంచిది కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ కి సినిమాలే బెస్ట్ రాజకీయాలు వేస్ట్ అంటున్నారు.