Renu Desai: కుక్క కోసం అందరిని రూ. 100 అడుగుతున్న రేణూ దేశాయ్

పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా వైరల్ వార్త వస్తే.. అందులో ఒక వర్గం ఈమెను కూడా వార్తల్లోకి లాగుతుంటారు. ఇదిలా ఉంటే రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

Written By: Suresh, Updated On : November 1, 2023 3:10 pm

Renu Desai

Follow us on

Renu Desai: రేణు దేశాయ్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె గురించి అందరికీ తెలిసిందే. ఇక బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2003లో జానీ సినిమాలో నటించి పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. ఆరేళ్ల రిలేషన్ తర్వాత ఈ ఇద్దరు 2009లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికంటే ముందు ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట పెళ్లి తర్వాత రెండు సంవత్సరాలు కూడా కలిసి లేరు. అంటే 2021లోనే విడిపోయింది ఈ జంట. దీంతో పవన్ కళ్యాణ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ రేణూ మాత్రం అలాగే ఉండిపోయింది. అఖిరా నందన్, ఆద్య తో కలిసి ఈమె ఒంటిరిగానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది.

ఇక పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా వైరల్ వార్త వస్తే.. అందులో ఒక వర్గం ఈమెను కూడా వార్తల్లోకి లాగుతుంటారు. ఇదిలా ఉంటే రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అవడంతో.. పలువురు దర్శకులు ఈమెకు కథ చెప్పడానికి సిద్దమవుతున్నారట. ఇక ఇదిలా ఉంటే ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ పోస్టులు పెడుతుంటుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

రేణు దేశాయ్ కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తను పెట్స్ తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే మాత్రం అసలు తట్టుకోలేదు రేణు. ఈమె వద్ద ఉన్న పెంపుడు జంతువుల గురించి మాత్రమే కాదు ఇతర పెంపుడు జంతువుల గురించి కూడా బాధ పడుతుంటుంది. వీటి కోసం విరాళాలు కూడా సేకరిస్తుంటుంది. తాజాగా ఒక కుక్క కోసం ఆపరేషన్ చేయించేందుకు ఒక సంస్థ విరాళాలు అడుగుతుంది. ఆపరేషన్ కోసం రూ. 55 వేల వరకు ఖర్చు వస్తుందంట. ఈ విషయం రేణు వరకు వెళ్లడంతో.. ఆమె తన వంతు సాయంగా రూ. 30 వేల విరాళం అందజేసింది. అంతే కాదు నా వంతు సాయంగా రూ. 35 వేలు అందించాను. మీలో ఎవరైనా కనీసం రూ. 100 ఇచ్చినా కూడా చాలు అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.