https://oktelugu.com/

Flop Heroes: 2021 హీరోల రివ్యూ  :  ప్లాప్ లు అందుకున్న  హీరోలు !

Flop Heroes: కరోనా మహమ్మారి దెబ్బకు  2020 మొత్తాన్ని  చిత్ర పరిశ్రమని పూర్తిగా కోల్పోయింది.  పైగా  ఆ ఏడాది కొన్ని సినిమాలు రిలీజ్ అయినా అవి ఎవరికీ కలిసి రాలేదు.  అయితే 2021కి తెలుగు సినిమా  పరిస్థితి కొంచెం పర్వాలేదు.  సినిమాలు  థియేటర్ లోకి వచ్చి బాగానే క్యాష్ చేసుకున్నాయి. కాకపోతే ఆ విజయాలు అనేవి కొన్నే. చాలావరకు ఈ ఏడాది కూడా  అపజయాలే ఎక్కువ.    మెయిన్ గా ఈ ఏడాది  మీడియం హీరోలు దాదాపుగా ప్లాప్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 27, 2021 4:05 pm
    Follow us on

    Flop Heroes: కరోనా మహమ్మారి దెబ్బకు  2020 మొత్తాన్ని  చిత్ర పరిశ్రమని పూర్తిగా కోల్పోయింది.  పైగా  ఆ ఏడాది కొన్ని సినిమాలు రిలీజ్ అయినా అవి ఎవరికీ కలిసి రాలేదు.  అయితే 2021కి తెలుగు సినిమా  పరిస్థితి కొంచెం పర్వాలేదు.  సినిమాలు  థియేటర్ లోకి వచ్చి బాగానే క్యాష్ చేసుకున్నాయి. కాకపోతే ఆ విజయాలు అనేవి కొన్నే. చాలావరకు ఈ ఏడాది కూడా  అపజయాలే ఎక్కువ. 
     
    మెయిన్ గా ఈ ఏడాది  మీడియం హీరోలు దాదాపుగా ప్లాప్ చిత్రాలనే  చూశారు. మరి ఆ హీరోల సంగతేంటో చూద్దాం. 
     
     
    బెల్లం కొండ శ్రీనివాస్: 
     
     
     బెల్లం కొండ శ్రీనివాస్ చేసిన  ‘అల్లుడు అదుర్స్’  సినిమా  రొడ్డకొట్టుడు జాబితాలో చేరి ప్లాప్ చిత్రంగా నిలిచింది.  దాంతో  ఈ  ఏడాది ఆరంభంలో మొదటి ఫ్లాఫ్ అందుకున్న  హీరో  బెల్లం కొండ శ్రీనివాసే.
     
     
     
    నితిన్: 
     
     ఈ ఏడాదిలో నితిన్   మూడు చిత్రాలు చేశాడు.  ‘రంగ్ దే’,  ‘చెక్’,  ‘మాస్ట్రో’…  ఈ మూడు హిట్ కాలేకపోయాయి. కాబట్టి  నితిన్ కి ఈ  2021 పూర్తిగా కలసిరాలేదు.
     
     
     
    సందీప్ కిషన్ : 
     
    సందీప్ కిషన్ హీరోగా  వచ్చిన  ‘ఏ1 ఎక్స్ ప్రెస్’, ‘గల్లీ రౌడీ’  సినిమాలు బాగా  నిరాశ పరిచాయి.
     
     
    రాజ్ తరుణ్ : 
     
    రాజ్ తరుణ్ హీరోగా చేసిన  ’పవర్ ప్లే’  బిగ్  ఫ్లాఫ్ అయ్యింది. అలాగే  అన్నపూర్ణ లాంటి బ్యానర్ లో వచ్చిన ‘అనుభవించురాజా’ కూడా  భారీ ప్లాప్ చిత్రంగా నిలిచింది.  మొత్తమ్మీద రాజ్ తరుణ్ కి ఈ ఏడాది అసలు కలిసి రాలేదు. 
     
     
     

    శర్వానంద్ : 

     
    శర్వా  సినిమాలు   ‘శ్రీకారం’,  ‘మహాసముద్రం’సినిమాలు కూడా  డిజాస్టర్లుగా నిలిచాయి.   శర్వా. ప్రమోషన్స్  చేసినా  హిట్ టాక్ రాలేదు. 
     
     
     

    కార్తికేయ : 

     
     కార్తికేయ హీరోగా వచ్చిన సినిమాలు  ‘చావు కబురు చల్లగా’,   ‘రాజా విక్రమార్క్’ నిరాశ పరిచాయి.  
     
    విశ్వక్ సేన్ :
     
     విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన  పాగల్ గొప్పగా లేదు. దాంతో ఈ సినిమా ప్లాప్ అయింది.  కమర్షియల్ గా కూడా బాగా నష్టపోయింది. 
     
     

    నాగశౌర్య : 

     
    నాగశౌర్య హీరోగా వచ్చిన  వరుడు కావలెను హిట్ అనుకున్నారు గానీ, డబ్బులు రాలేదు.  ఇక  ‘లక్ష్య’  సినిమా అయితే పెద్ద  డిజాస్టర్ అయ్యింది.  
     
     
     
    సాయి ధరమ్ తేజ్ : 
     
      
    సాయిధరమ్ తేజ్ కి  ఈ ఏడాది అసలు కలిసి రాలేదు.  ఒక  ఈ ఏడాది   ఓ పీడకల. ఇక ఆయన హీరోగా వచ్చిన  రిపబ్లిక్ సినిమా కూడా బిగ్  ఫ్లాఫ్ అయ్యింది.
       
    Tags