దర్శకుడు మెహర్ రమేష్ కి టాలెంట్ ఉన్నా.. లక్ లేదు. ఒక కొత్త డైరెక్టర్ కి దక్కని అదృష్టం ఎన్టీఆర్ ను రెండు సార్లు డైరెక్ట్ చేయడం, ప్రభాస్ ను ఒకసారి డైరెక్ట్ చేయడం.. నిజంగా ఇది ఓ గొప్ప అవకాశమే. పైగా కెరీర్ లో ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయినా మెహర్ రమేష్ తీసిన సినిమాలన్ని భారీ బడ్జెట్ సినిమాలే. కాకపోతే అవి భారీ ప్లాప్ అయ్యాయి అనుకోండి. దాంతో సినిమా లేక దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అయిన మెహర్ రమేష్ కి మెగాస్టార్ పెద్ద మనసుతో పిలిచి మరీ ఆవకాశం ఇచ్చారు. వేదాళం రీమేక్ ను చేయడానికి స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు.
Also Read: ‘కలర్ ఫొటో’ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
కాగా మెహర్ రమేష్ చేసిన స్క్రిప్ట్ వర్క్ మెగాస్టార్ కి నచ్చిందని.. ముఖ్యంగా కథలోని మెయిన్ ఎమోషన్స్ ను మెహర్ చాలా బాగా పట్టుకున్నాడు అని.. మెగాస్టార్ ఫీల్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి భారీ ప్లాప్ డైరెక్టర్ గా బలమైన ముద్ర వేసుకున్న మెహర్ రమేష్.. మెగాస్టార్ ను ఇంప్రెస్ చేశాడంటే మాటలు కాదు. నిజానికి మెహర్ రమేష్ ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ప్లాప్ సినిమాలు చేసినా.. ఒక దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కాకపోతే చేసిన సినిమాలేవి కమర్శియ ల్ గా సక్సెస్ కాకపోగా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. మరి ఈ సారైనా మెహర్ హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read: పవన్-రానా కాంబో ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?
ఎలాగూ మెహర్ రమేష్ కి మెగాస్టార్ లైఫ్ చేంజింగ్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి.. పైగా మెగాస్టార్ హీరో కాబట్టి.. మరి ఆయనతో చేయబోయే సినిమా అయినా హిట్ అవుతుందేమో.. ఎంతైనా మెహర్ ప్లాప్ డైరెక్టర్ కావొచ్చు.. కానీ మెహర్ సినిమాల్లో కమర్శియల్ హంగులు బాగానే జొప్పిస్తాడు. అన్నిటికి మించి భారీ బడ్జెట్ సినిమాలను చేసిన అనుభవం ఉంది. అందుకే మెగాస్టార్ కూడా అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య తరువాత మెహర్ రమేష్ సినిమానే ఉండొచ్చు అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మెహర్ సినిమా తర్వాత మరో రెండు..మూడు సినిమాలు కూడా వెంటనే చేయనున్నారు. ఆ సినిమాల్లో వినాయక్ సినిమా కూడా ఉంది.