Thank You Movie: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ” థ్యాంక్ యూ ” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ మూవీని ఇచ్చిన విక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రాశీ ఖన్నా నటిస్తుంది. బి.వి.ఎస్.రవి ఈ సినిమాకు కథనందిస్తుండగా… తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ రోజు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ చైతూ అభిమానులకి ఓ సర్ ప్రైజ్ గుఫ్ట్ ఇచ్చింది.
తాజాగా ‘థ్యాంక్ యూ’ మూవీ ఫస్ట్ లుక్ ను సోషల్ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ మేయరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాగ చైతన్య సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనబడుతు అలరిస్తున్నాడు. ఈ మూవీ లో చైతన్య సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా దూసుకుపోతుంది. మరోవైపు చైతూ నటిస్తున్న బంగార్రాజు మూవీ నుంచి టీజర్ ను కూడా ఈరోజు చేశారు. ఒకే రోజు రెండు అప్డేట్ లతో అక్కినేని నాగ చైతన్య అభిమానులంతా ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పాలి.
Presenting the first look of #ThankYouMovie!🤩#HBDYuvasamratNagaChaitanya@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/uwIeOxPIG9
— Sri Venkateswara Creations (@SVC_official) November 23, 2021