https://oktelugu.com/

3 Capitals: జీతాలకే డబ్బుల్లేని జగన్ కు మూడు రాజధానులా?

Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు చిత్తశుద్ధి లేకే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సంక్షేమం పేరుతో నిధులున్నీ నేరుగా ప్రజలకు అందజేస్తున్నా పాలన మాత్రం గాడి తప్పుతుందనే విమర్శలు వస్తున్నాయి. అయినా ఒంటెత్తు పోకడతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. నేతల్లో నేడు విచక్షణ కనిపించడం లేదు. ఎంత పడితే అంత మాట్లాడుతూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యక్ష తార్కాణమే ఇటీవల మాజీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 23, 2021 / 04:30 PM IST
    Follow us on

    Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు చిత్తశుద్ధి లేకే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సంక్షేమం పేరుతో నిధులున్నీ నేరుగా ప్రజలకు అందజేస్తున్నా పాలన మాత్రం గాడి తప్పుతుందనే విమర్శలు వస్తున్నాయి. అయినా ఒంటెత్తు పోకడతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

    నేతల్లో నేడు విచక్షణ కనిపించడం లేదు. ఎంత పడితే అంత మాట్లాడుతూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యక్ష తార్కాణమే ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కంటతడి పెట్టడం శోచనీయం. వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు చేస్తూ వారిలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏపీలో రాజకీయాల్లో వస్తున్న మార్పులపై ప్రజలు కూడా అసహ్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అభివృద్ధిపై పట్టించుకోని నేతలు వ్యక్తిగత విమర్శలకే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం దారుణం. నేతల్లో చిత్తశుద్ధి కొరవడి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయి. ప్రజా సమస్యలను పక్కన పెడుతూ అధికారమే ఎజెండాగా నేతల తీరులో మార్పు రావడంపై ఆందోళన కలిగిస్తోంది. దీనిపై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. వైసీపీ తీరుపై విమర్శలు చేశారు.

    Also Read: AP Assembly: జగన్ పీచేముడ్.. బలమొచ్చింది.. ‘‘మండలి రద్దు’’ రద్దైంది!

    కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంటే రాష్ర్టం మాత్రం తన పంథాలోనే కొనసాగుతూ ప్రజలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా జగన్ నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపించారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మండిపడ్డారు. ఉద్యోగుల వేతనాలకే డబ్బుల్లేకపోయినా మూడు రాజధానుల వ్యవహారాన్ని మాత్రం తనదైన కుట్రలో భాగంగా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకుని ప్రజా అభీష్టాలకు పెద్దపీట వేయాలని సూచించారు.

    Also Read: BJP, MIM: పైకి కత్తుల కయ్యం.. లోపల తియ్యటి బెల్లం!! ఇదీ బీజేపీ-మజ్లీస్‌ తీరు

    Tags