Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు ఆర్థిక కష్టాలు.. ఆ నిర్మాత ఆదుకున్నాడంటూ షాకింగ్ మేటర్ లీక్...

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు ఆర్థిక కష్టాలు.. ఆ నిర్మాత ఆదుకున్నాడంటూ షాకింగ్ మేటర్ లీక్ చేసిన రౌడీ హీరో!

Vijay Devarakonda: టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఎదిగిన తీరు అద్భుతం. చిన్న చిన్న పాత్రతో మొదలైన ఆయన కెరీర్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగింది. విజయ్ దేవరకొండ పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టాయి. టైర్ టు హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ చేరాడు. స్టార్ హీరోల రేంజ్ ఇమేజ్ ఆయన సొంతం.

విజయ్ దేవరకొండ సినిమాకు రూ. 20 – 25 కోట్ల తీసుకుంటాడని సమాచారం. అలాంటి స్టార్ కి కూడా ఆర్థిక కష్టాలు తప్పలేదట. 2020లో కోవిడ్ విజృంభించింది. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా దేశం నెలల తరబడి స్తంభించి పోయింది. ఆ సమయంలో నటులకు కూడా పని లేదు. హీరో విజయ్ దేవరకొండ సైతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. తనకు డబ్బులు టైట్ గా ఉంటే.. దిల్ రాజు అడ్వాన్స్ పంపారని విజయ్ దేవరకొండ తాజాగా వెల్లడించారు.

ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ ఈ విషయం వెల్లడించారు. నేను ఫలానా జోనర్స్ మాత్రమే చేయాలి అనుకోలేదు. కథలు వింటుండగా పరశురామ్ నాకు ఒక కథ చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ కావాలని అడిగాను.నాతో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుండో అనుకుంటున్నారు. కథలు కూడా పంపారు. కోవిడ్ సమయంలో నాకు అడ్వాన్స్ కూడా పంపారు. అప్పుడు నాకు కొంచెం డబ్బులకు టైట్ గా ఉంది.

పరశురామ్ చెప్పిన కథ గురించి దిల్ రాజుకు చెప్పాను. ఒకరోజు స్క్రిప్ట్ తో దిల్ రాజు, పరశురామ్ నా దగ్గరకు వచ్చారు. స్క్రిప్ట్ నాకు నచ్చడంతో ఓకే చేశాను. ఈ మూవీ ఇంత త్వరగా పూర్తి కావడానికి గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ వారి సహకారం ఉంది. వారు అర్థం చేసుకున్నారు కాబట్టే ఇది సాధ్యం అయ్యింది. అందుకు వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలి, అన్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదలవుతున్న సంగతి తెలిసిందే…

RELATED ARTICLES

Most Popular