Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: జీవితం కొన్నాళ్లే హ్యాపీగా బ్రతికేయాలి... విజయ్ దేవరకొండ లైఫ్ ని ఇలా ప్లాన్...

Vijay Devarakonda: జీవితం కొన్నాళ్లే హ్యాపీగా బ్రతికేయాలి… విజయ్ దేవరకొండ లైఫ్ ని ఇలా ప్లాన్ చేశాడో చూడండి!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్ర ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన ఒకింత ఫిలాసఫి మాట్లాడారు. ఉన్నన్నాళ్ళు నచ్చింది చేస్తూ హాయిగా బ్రతికేయడమే అంటున్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ఈ ప్రపంచంలో మాక్సిమమ్ మనం వందేళ్లు ఉంటాము. డైట్ లు, వర్క్ అవుట్లు చేస్తే హెల్తీగా ఒక 70-80 ఏళ్ళు బ్రతుకుతాము. ఆల్రెడీ మనకు ఒక 30 ఏళ్ళు అయిపోయాయి. మిగిలిన జీవితాన్ని హ్యాపీగా నచ్చింది చేస్తూ బ్రతకాలి.

ఈ సినిమా హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఇదే జీవితం అన్నట్లు బ్రతక కూడదు. మనకు నచ్చింది చేస్తాము. కష్టపడతాము. అందుకు కొంత డబ్బులు వస్తాయి. దాంతో కంఫర్ట్ గా జీవించాలి. అంతే కానీ హైరానా పడిపోకూడదని అన్నారు. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. చెప్పాలంటే గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు హిట్ పడలేదు.

గత చిత్రం ఖుషి యావరేజ్ గా నిలిచింది. ఈ మూవీ కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చింది. దాంతో అచ్చొచ్చిన కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. దర్శకుడు పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కొట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్ కి ఆ చిత్రం ఎంతగానో ఉపయోగపడింది. యూత్ లో విజయ్ దేవరకొండకు విపరీతమైన ఇమేజ్ తెచ్చి పెట్టిన చిత్రం గీత గోవిందం. ఫ్యామిలీ స్టార్ తో ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు.

లవ్, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టార్ తెరకెక్కింది. విజయ్ దేవరకొండకు జంటగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి.

RELATED ARTICLES

Most Popular