https://oktelugu.com/

Sobhita Naga Chaitanya Engagement: కాబోయే కోడలితో నాగార్జున… శోభిత, నాగ చైతన్యల నిశ్చితార్థం ఫొటోలు వైరల్

ఎట్టకేలకు సస్పెన్సు వీడింది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య నిశ్చితార్థం పై అధికారిక ప్రకటన వచ్చేసింది. నాగార్జున ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 8, 2024 / 01:50 PM IST

    Sobhita Naga Chaitanya Engagement

    Follow us on

    Sobhita Naga Chaitanya Engagement: హీరో నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల రిలేషన్ లో ఉన్నారంటూ గత రెండేళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఒకటి రెండు సందర్భాల్లో ఖండించారు. అయితే శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య కలిసి దిగిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకున్న ఇంటికి తరచుగా శోభితను తీసుకుని వెళ్లేవాడనే టాక్ ఉంది. అలాగే వీరు కలిసి విదేశాలకు, విహారాలకు వెళుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వీరిద్దరూ షేర్ చేసే ఫోటోలు పోలికలు కలిగి ఉండేవి.

    గతంలో వీరిద్దరూ లండన్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియన్ రెస్టారెంట్ చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగారు. ఆ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సదరు ఫోటోలో దూరంగా కూర్చుని ఉన్న శోభిత సైతం కనిపించింది. వెంటనే సదరు ఫోటో ఆ చెఫ్ డిలీట్ చేశారు.

    ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. నిన్నటి నుండి నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. నేడు నాగార్జున నివాసంలో ఈ వేడుక ముగిసింది. కాబోయే కోడలికి నాగార్జున ఆహ్వానం పలికారు. కొడుకు, కోడలితో దిగిన ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆగస్టు 8 ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-నాగ చైతన్యల నిశ్చితార్థం జరిగింది.

    ”శోభిత ధూళిపాళ్లతో నా కుమారుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి కొత్త సభ్యురాలిని ఆహ్వానిస్తున్న అందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జంటకు శుభాకాంక్షలు. వారు జీవితాంతం కలిసి ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను…” అని నాగార్జున రాసుకొచ్చారు.

    శోభిత-నాగ చైతన్యలకు నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శోభిత వివరాలు పరిశీలిస్తే… ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. ఆమెది బ్రాహ్మణ సామాజిక వర్గం. వైజాగ్, ముంబై నగరాల్లో చదువుకుంది. మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. అనేక వ్యాపార ప్రకటనల్లో ఆమె నటించారు. అనంతరం నటిగా మారింది.

    2016లో విడుదలైన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆమె ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో శోభిత మొదటి చిత్రం గూఢచారి. అడివి శేష్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ సూపర్ హిట్ అని చెప్పాలి. మేజర్ మూవీలో మరోసారి అడివి శేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

    ఇంగ్లీష్ లో కూడా శోభిత చిత్రాలు చేసింది. మంకీ మ్యాన్ మూవీలో శోభిత బోల్డ్ రోల్ చేయడం విశేషం. దేవ్ పటేల్ ఈ హాలీవుడ్ మూవీలో హీరోగా నటించాడు. మరోవైపు నాగ చైతన్యకు ఇది రెండో వివాహం. 2017లో నాగ చైతన్య హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 లో మనస్పర్థలతో విడిపోయారు. అనంతరం శోభితతో ప్రేమలో పడ్డ నాగ చైతన్య పెళ్ళికి సిద్దమయ్యాడు. శోభిత ప్రస్తుతం సితార టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా తండేల్ టైటిల్ తో ఒక చిత్రం తెరకెక్కుతుంది. తండేల్ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు.