https://oktelugu.com/

Films in May: మే లో రిలీజుకు రెడీ అవుతున్న చిత్రాలివే..!

Films Ready For Release in May 2022: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే  కోలుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాలన్నీ కూడా మంచి టాక్ తెచ్చుకొని భారీ ఓపెన్స్ రాబడుతున్నాయి. దీంతో టాలీవుడ్ పరిశ్రమ మళ్లీ మునుపటి పరిస్థితికి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో విడులైన ‘డీజే టిల్లు’, పవన్ కల్యాణ్ ‘బీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపించాయి. ఆ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2022 / 03:16 PM IST
    Follow us on

    Films Ready For Release in May 2022: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే  కోలుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాలన్నీ కూడా మంచి టాక్ తెచ్చుకొని భారీ ఓపెన్స్ రాబడుతున్నాయి. దీంతో టాలీవుడ్ పరిశ్రమ మళ్లీ మునుపటి పరిస్థితికి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

    F3 Release Date

    ఫిబ్రవరి నెలలో విడులైన ‘డీజే టిల్లు’, పవన్ కల్యాణ్ ‘బీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపించాయి. ఆ తర్వాత మార్చిలో వచ్చిన ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. కిందటి నెలలో విడుదలైన ‘కేజీఎఫ్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందగా ‘ఆచార్య’ మిక్స్ డ్ టాక్ తో పర్వాలేదనిపించుకుంటోంది.

    Also Read: Keerthy Suresh: ‘కీర్తి సురేష్’ బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఫాలో అయితే అందం మీదే !

    ఇక మే నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్-3’ రాబోతున్నాయి. వీటితోపాటు సుమ కనకాల రీ ఎంట్రీ చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ శ్రీ విష్ణు నటించిన ‘భళా తందనాన’ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, రాజశేఖర్ నటించిన ‘శేఖర్’, ‘గాడ్సే’, ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాలు రానున్నాయి.

    ashokavanamlo arjuna kalyanam movie

    విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మే 6న విడుదల కానుంది. సుమ నటించిన ‘జయమ్మ పంచాయితీ’, శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘భళా తందనాన’ మూవీలు మే 8న థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. మహేష్ బాబు ‘సర్కారువారిపాట’ మే 12న వరల్డ్ వైడ్ గా రిలీజు కానుంది.

    నాగశౌర్య హీరోగా నటించి ‘కృష్ణ వ్రింద విహారి’, సత్యదేవ్ నటించిన ‘గాడ్స్’ మే 20న విడుదల కానున్నాయి. హీరో రాజశేఖర్ తాజా చిత్రం ‘శేఖర్’ మూవీని కూడా మే 20నే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘విక్టరీ’ వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్-3’ మూవీ మే 27న విడుదల కానుంది. వీటిలో ‘సర్కారువారిపాట’, ‘ఎఫ్-3’పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    Also Read:Pavan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రేమ అంటే ఇలా ఉంటుంది