Hyderabad: హైదరాబాద్లో రేవ్ పార్టీలో పట్టుబడిన సినీ ప్రముఖులు

వెంకట్ తో పాటు బాలాజీ,వెంకటేశ్వర రెడ్డి, మురళి, మధుబాల, మెహక్ లు డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుబడ్డారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు నిందితుల నుంచి ఎల్ ఎస్ డి, కొకైన్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

Written By: Dharma, Updated On : August 31, 2023 2:12 pm

Hyderabad

Follow us on

Hyderabad: హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్కోటిక్ బ్యూరో అధికారులు మాదాపూర్ లోని అపార్ట్మెంట్లో అర్ధరాత్రి రేవ్ పార్టీని భగ్నం చేశారు. డ్రగ్స్ సేవిస్తూ పలువురు సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. ఇందులో సినిమా ఫైనాన్స్ వెంకట్ ఉన్నారు. డమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్ సూర్య తదితర సినిమాలకు వెంకట్ ఫైనాన్సర్ గా వ్యవహరించారు.

వెంకట్ తో పాటు బాలాజీ,వెంకటేశ్వర రెడ్డి, మురళి, మధుబాల, మెహక్ లు డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుబడ్డారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు నిందితుల నుంచి ఎల్ ఎస్ డి, కొకైన్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

అయితే ఇందులో సినిమా ఫైనాన్స్ వెంకట్ తో పాటు బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంకట్ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగినట్లు చెబుతున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీలో నిర్వహిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. వెంకట్ కదలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. వెంకట్ వెనుక ఉన్న అదృశ్య వ్యక్తులపై ఆరా తీస్తోంది.