
నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో పని చేయాలని ఎవరైనా ఆశ పడతారు. అలాంటి రాజమౌళి సినిమాలో పని చేయడం వల్ల ఉపయోగం లేదంటూ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు జక్కన్న పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మగధీరతో పాటు రాజమౌళి తెరకెక్కించిన పలు సినిమాలకు రామ్-లక్ష్మణ్ లు ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు. .
అయితే, రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ రీసెంట్ గా ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమాకు పని చేస్తే పేరు రాదని మాట్లాడుతూ.. రాజమౌళిగారు తన సినిమాలోని ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలన్ని ఆయనే దగ్గరుండి ప్లాన్ చేస్తారు. పైగా 70 శాతం స్టంట్స్ కూడా రాజమౌళినే స్వయంగా డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది.
దాంతో స్టంట్స్ ఇక సొంతంగా చేసిన ఫీలింగ్ ఫైట్ మాస్టర్స్ కు ఉండదు. అందుకే, రాజమౌళి సినిమాలకు ఏ ఫైట్ మాస్టర్స్ పని చేసినా వారికి పెద్దగా పేరు రాదు. క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్ళిపోతుంది’ అంటూ ఈ లోకల్ టాలెంటెడ్ ఫైట్ మాస్టర్స్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు. అయితే ఇంత ఓపెన్ గా కామెంట్స్ చేసినా… తాము రాజమౌళి సినిమాకు పని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని,
కాకపోతే రాజమౌళి సినిమాలకు ఫైట్ మాస్టర్స్ ఒకేసారి 50 రోజుల వరకు డేట్స్ ఇవ్వాల్సి వస్తోందని..కానీ మేము డేట్స్ ఎక్కువగా ఇవ్వలేకపోవడమే వల్ల బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని రామ్ లక్షణ్ మాస్టర్స్ చెప్పుకొచ్చారు. అన్నట్టు ఆర్ఆర్ఆర్ లో ఇంటర్వెల్ ఫైట్ ను రామ్ – లక్షణ్ మాస్టర్స్ 10 రోజులు పాటు చిత్రీకరించిన విషయం తెలిసిందే.