
జగన్ రెండేళ్ల పాలన పూర్తయింది. మరోసారి ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికలు అంత తేలిగ్గా ఉండేలా లేవు. 2019 ఎన్నికలు వేరు 2024 ఎన్నికలు వేరేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ బాగా కష్ట పడాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో రాజకీయాలు కొత్త మలుపులు తిరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఏ మేరకు విజయం సాధిస్తారోననే అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి.
జగన్ ఈ సారి సీనియర్లకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా తిరుపతి ఉప ఎన్నికలో కొత్త వారికే అవకాశం కల్పించారు. దీంతో ఇప్పుడున్న వయసు పైబడిన వారందరిని పక్కన పెట్టి యువకులను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లలో అప్పుడే భయం నెలకొంది. తమను ఇంటికి సాగనంపితే పరిస్థితి ఏమిటనే విషయంలో అప్పుడే ఆలోచనలు చేస్తున్నారు. తదుపరి చర్యలు ఏం చేయాలనే దానిపై ఎవరికి వారే నిర్ణయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సీనియర్లు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని షరతు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాగైతే లిస్టు మొత్తం చూస్తే ఇక టికెట్లన్నీ వారి వారసులకే కేటాయించాల్సి వస్తుంది. దీంతో జగన్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నారు. కొత్త వారంటే వారసులు కాదు యువతను ప్రోత్సహించేందుకు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వైసీపీలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నాు. ఏది ఏమైనా జగన్ పార్టీ భవితవ్యం దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకుని పార్టీని గట్టెక్కిస్తారో వేచి చూడాల్సిందే.
సీఎం జగన్ ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నట్లు చెబుతున్నారు. సీనియర్లను తప్పించి నూతన వ్యక్తులకు అవకాశం ఇచ్చి వారిని విధేయులుగా చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో జనాల్లో కూడా ఓ మంచి లుక్ వస్తుందని విశ్లేషిస్తున్నారు. మరి సీనియర్లను పక్కన పెడితే వారు ఊరుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్లు ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి వైసీపీ పరిస్థితి విచిత్రమైన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ పక్క ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించాలంటే కూడా డబ్బు అవసరమే. కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఇప్పుడు కష్టాల్లో పడింది. ఉద్యోగుల వేతనాల కోసం కూడా ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో జగన్ ఏ మేరకు విజయం సాధిస్తారో అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.