సినిమా వాళ్లు అవుట్ డోర్ షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లడం కామన్. అయితే అక్కడ వాళ్లుపడే ఇబ్బందులు మాములుగా ఉండవు. తెలియని ప్రాంతంలో షూటింగు చేయడమంటే కత్తి మీద సామే. నిత్యం రణరంగంగా మారే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో షూటింగు చేయడమే ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నట్లే. ఇలాంటి సంఘటనే హీరో సత్యదేవ్ కు ఎదురైంది.
Also Read: వామ్మో.. రమ్యకృష్ణ పారితోషికం అన్ని కోట్లా..?
‘హబీబ్’ అనే హిందీ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే చిత్రయూనిట్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరిది ఆఫ్ఘనిస్తాన్ అందుకే అక్కడ షూటింగు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగులో పాల్గొన్న సత్యదేవ్ కు అనుహ్య పరిస్థితి ఎదురైంది. షూటింగులో భాగంగా సత్యదేవ్ ఓ బిల్డింగ్ ముందు నాలుగైదు సార్లు ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగాల్సి వచ్చింది.
సీన్ ఎలా వచ్చిందో చూసుకుంటూ ఆ బిల్డింగులోనే సత్యదేవ్ ఉండిపోయాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు అక్కడకు చేరుకొని అతడిని అరెస్టు చేశారు. అప్పుడు సత్యదేవ్ తోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ రజాక్ కూడా ఉన్నారు. పోలీసుల రాకతో పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చి తమను చంపేయాలంటూ బాటిల్స్ తీసుకొని దాడికి పాల్పడ్డారని సత్యదేవ్ తెలిపారు.
ఇక అదే తనకు చివరిరోజు అని అనుకున్నానని సత్యదేవ్ నాటి భయంకర పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. పోలీసులు తమను వీసా అడిగారని అయితే తమ వద్ద పాస్ పోర్టు లేకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని సత్యదేవ్ వాపోయారు. చివరికు ఇండియన్ ఎంబసీ.. ఆఫ్ఘనిస్తాన్ ఎంబీసీ అధికారులు అక్కడికి చేరుకొని పోలీసులకు నచ్చజెప్పడంతో గొడవ సర్దిమణిగిందని వాపోయాడు.
Also Read: నాగబాబును అభినందించిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?
తాను ఆత్మహుతి చేసుకుంటానని భయపడి ప్రజలంతా భయపడ్డారని ఆప్ఘనిస్తాన్ ప్రజల దుస్థితిని సత్యదేవ్ వివరించాడు. ఈ ఒక్క సంఘటనతో ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు ఎలా బ్రతుకు ఈడుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్కర పరిస్థితిని సత్యదేవ్ క్షేమంగా బయటపడటంతో ఆయన అభిమానులంతా ఊపిరిపిల్చుకున్నారు.