Fauji Movie Story: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. బాలీవుడ్ హీరోలను సైతం పక్కన పెడుతూ ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రీసెంట్గా ఆయన చేసిన రాజాసాబ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడనే చెప్పాలి. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఈ మూవీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇంతకు ముందే హను రాఘవపూడి ‘సీతారామం’ సినిమాని చేశాడు.
ఈ సినిమాలో సాడ్ ఎండింగ్ ఉంటుంది. మరి దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాలో కూడా మరోసారి సాడ్ ఎండింగ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చనిపోతుందా? హీరో చనిపోతాడా? అనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు.
కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతున్నారు అనేది క్లారిటీ గా తెలుస్తోంది. ఇక హను రాఘవపూడి డిఫరెంట్ లవ్ స్టోరీస్ ని తెరమీద ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు హను రాఘవపూడి చేసింది చిన్న హీరోలతో కాబట్టి ఎలాంటి ప్రయోగాలు చేసిన వర్కౌట్ అయింది.
ఇక ప్రభాస్ తో అలాంటి ఒక భారీ ప్రయోగం చేస్తూ సాడ్ ఎండింగ్ ఇస్తే సినిమాని ప్రేక్షకుడు ఎలా జీర్ణించుకుంటాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ ను అమాంతం పెంచేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా నుంచి తొందర్లోనే ఒక భారీ అప్డేట్ ని సైతం ఇవ్వడానికి దర్శకుడు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…