Fauji : ప్రభాస్(Rebel Star Prabhas), హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ'(Fauji Movie). ఈ ఏడాది ప్రభాస్ అత్యధిక కాల్ షీట్స్ ఈ చిత్రం కోసమే కేటాయించాడు. 30 శాతం కి పైగా షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరో క్యారక్టర్ ఎంత ముఖ్యమో, హీరోయిన్ క్యారక్టర్ కూడా అంతే ముఖ్యం. హీరోయిన్ ముఖం ఫ్రెష్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Ismael) అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించిన ఈమెకు, మొదటి సినిమా తోనే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి. అయితే ఈమె పాకిస్థానీ అమ్మాయి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమె తల్లి మన భారత దేశానికీ చెందిన అమ్మాయి, తండ్రి పాకిస్థాన్.
Also Read : వివాదాల్లో ‘ఫౌజీ’..పాకిస్థాన్ ఆర్మీ కి హీరోయిన్ ఇమాన్వి కి ఉన్న లింక్ ఏమిటంటే!
గతంలో ఈమె ఇన్ స్టాగ్రామ్ లో తన తల్లిదండ్రులు కలిసి ఉన్న ఫోటో ని అప్లోడ్ చేస్తూ ‘మా అమ్మ ఇండియా, మా నాన్న పాకిస్థాన్. వాళ్లిద్దరూ దేశాలకు సంబంధించిన సంస్కృతి, మాట్లాడే భాషలను మీ ముందు బయటపెట్టడానికి నేను ఎంతో గర్విస్తున్నాను’ అంటూ గతంలో ఆమె పెట్టిన పోస్టులను సోషల్ మీడియా లో నెటిజెన్స్ బాగా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈమెని టార్గెట్ చేసి ఆమె పాత పోస్టులను వైరల్ చేయడానికి ముఖ్య కారణం, నిన్న ఆమె అబద్దం చెప్పడమే. నేను ఇండో అమెరికన్ ని అని చెప్పుకోడానికి గర్వ పడుతున్నానని, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టు మా నాన్న పాకిస్థాన్ మిలటరీ కి చెందిన వాడు కాదని, నేను పుట్టి పెరిగింది లాస్ ఏంజిల్స్ లో అని, చిన్న తనంలోనే మా కుటుంబీకులు అమెరికా కి షిఫ్ట్ అయిపోయారని, మాకు పాకిస్థాన్ కి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది.
అయితే రీసెంట్ గా కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడుల్లో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత మన భారతదేశ ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది పాకిస్తాన్ దేశానికీ చెందిన వాళ్ళు మన ఇండియా లో ఉండకూడదు. వాళ్లకు సంబంధించిన ‘సార్క్’ వీసా ని క్యాన్సిల్ చేస్తూ 48 గంటల్లో మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళు మన దేశంలోకి అడుగుపెట్టడానికి వీలు లేదు. అంతే కాకుండా పాకిస్థాన్ నటీనటులు కూడా మన సినిమాల్లో నటించడానికి వీలు లేదట. అందుకే ఇమాన్వి ని ఫౌజీ చిత్రం నుండి తప్పించాలని సోషల్ మీడియా లో డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్. మేకర్స్ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారట. ఇమాన్వి ని తొలగించి ఆమె స్థానం లో మరో హీరోయిన్ ని పెట్టి తీస్తే బడ్జెట్ డబుల్ అవుతుందని సమాచారం.
Also Read : నాకు పాకిస్థాన్ సైన్యం తో సంబంధం లేదు..ఆరోపణలపై స్పందించిన ప్రభాస్ ‘ఫౌజీ’ హీరోయిన్!