Fauji First Look: నేడు రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరో గా నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రానికి సమందించిన ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ షూటింగ్ ప్రారంభం రోజే లీక్ అయ్యింది. కానీ మేకర్స్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇన్ని రోజులు ఈ చిత్రం కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఒక సైనికుడి వీరోచిత గాఢ అని నేడు విడుదల చేసిన పోస్టర్ ద్వారా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అందరూ ఒక వైపు యుద్ధం చేస్తుంటే, హీరో మాత్రం మరో వైపు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు అని అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు.
స్టోరీ విషయానికి వస్తే ఇది రజాకార్ మూవ్మెంట్ జరుగుతున్న రోజులకు సంబంధించినది అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ కాలం లో ఒక పాకిస్తానీ అమ్మాయి తో, మన తెలుగు సైనికుడు ప్రేమలో పడడం, ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దినట్టు తెలుస్తుంది. ఈ కథలో ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అంతులేని యుద్ధం కూడా ఉంటుంది. హను రాఘవపూడి తన ప్రతీ చిత్రాన్ని ఒక అందమైన పద్యం లాగా వెండితెర పై ఆవిష్కరిస్తూ ఉంటాడు. కానీ ఇన్ని రోజులు ఆయన ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో సినిమాలు చేయలేదు. కాబట్టి, తన మార్క్ టేకింగ్ తో పాటు, ప్రభాస్ మార్క్ యాక్షన్ హీరోయిజం కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా ఇమాన్వి అనే అమ్మాయి ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది. ఈమె తల్లిదండ్రులు కూడా పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు అవ్వడం విశేషం.
ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కారణంగా ఆయనతో పూర్తి స్థాయి లవ్ స్టోరీలను తీయలేరు డైరెక్టర్స్. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన ఏకైక లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్. ఈ చిత్రం డీసెంట్ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా, కమర్షియల్ గా ఇండియా లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిల్చింది. అలాంటి సినిమాగా ‘ఫౌజీ’ నిలబడకపోతే చాలు అని ఇన్ని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ అనుకునేవారు. కానీ ఫస్ట్ లుక్ తోనే ప్రభాస్ ని మాస్ యాంగిల్ లో చూపించి, మీరు ఊహించుకున్న విధంగా ఇది పూర్తి స్థాయి లవ్ స్టోరీ కాదు అనే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ హను రాఘవపూడి. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది.