Fauji movie villain mystery : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్లే కావడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరో సైతం తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో ఫౌజి (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు ను ఏర్పాటు చేసుకోవాలనే దిశగా ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆయన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడమే కాకుండా లవర్ బాయ్ క్యారెక్టర్ ని కూడా పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.
లవ్ స్టోరీలను తెరకెక్కించడం లో హను రాఘవపూడి (Hanu Raghavapudi) మంచి ప్రావీణ్యం ఉన్న దర్శకుడు. కానీ ప్రభాస్ మాత్రం ఈ మధ్యకాలంలో చేసిన రాధేశ్యామ్ (Radheshyam) సినిమాలో ఆయన లుక్స్ చాలా దారుణం గా ఉన్నాయంటూ ట్రోల్స్ అయితే వచ్చాయి…మరి ఈ సినిమాలో ఆయన లుక్స్ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇప్పటికే ఫౌజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
Also Read : వివాదాల్లో ‘ఫౌజీ’..పాకిస్థాన్ ఆర్మీ కి హీరోయిన్ ఇమాన్వి కి ఉన్న లింక్ ఏమిటంటే!
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాతో పెను సంచలనాలను సృష్టించడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలైతే ఉంటాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమాలో డిఫరెంట్ యాక్టింగ్ తో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరని అది క్లైమాక్స్లో ఒక భారీ ట్విస్ట్ లాగా పేలబోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఫౌజీ సినిమాలో మన దేశానికి ఇతర దేశాలకు మధ్య జరిగే ఒక వార్ సీక్వెన్స్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఇందులో ఇంటర్నల్ గా జరిగే కొన్ని మోసాలు అన్నీ ఉంటాయట. ఇక ఈ సినిమాలో విల్లన్ ఎవ్వరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…