Faria Abdullah: జాతి రత్నాలు మూవీతో వెండితెరకు పరిచయమైన హైదరాబాదీ ముద్దు గుమ్మా ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఒక యూట్యూబర్ గా, మోడల్ గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా పలు విభాగాల్లో పనిచేసింది. 2021 లాక్ డౌన్ సమయంలో విడుదలైన జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాటు పెద్ద మొత్తంలో లాభాలు పంచింది.
ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బంగార్రాజు,లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్,రావణాసుర లాంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో ప్రామిసింగ్ నటిగా ముందుకు సాగుతుంది. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈ హైదరాబాదీ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు వాటికి పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతున్నాయి.
“హలో గయ్స్ ఇది నా స్థాయిని పెంచే సమయం.. మీ అందరు నాతో ఉంటారా ? ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుంచి ఇప్పటి వరకు మనం అన్ లాక్ చేయని సామర్ధ్యానికి చేరువలో ఉన్నాం. నేను ఉత్సాహం గా ఉన్నాను, వాటిపై ఫోకస్ పెట్టాను. నెమ్మదిగా నడుస్తున్నా, పులి వేటాడే సమయం వచ్చేసింది. ” అనే అర్ధం వచ్చే లా క్యాప్షన్ పెట్టి ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేసింది.
ఈ పోస్ట్ కి ఆమె ఫ్యాన్స్ కూడా అదే రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.. మీ వెనక మేము ఉన్నాం. ఈ ఏడాది కుమ్మేద్దాం అని ఒకరు. ఏదో పెద్ద ప్రాజెక్ట్ పట్టినట్లు ఉన్నావు కదా అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఫరియా నటించిన “ది జంగబూరు క్యూర్స్” వెబ్ సిరీస్ ట్రయిల్ విడుదలై మంచి పాజిటివ్ సొంతం చేసుకుంది. ఆగస్టు 9 నుంచి సోనీ లివ్ లో టెలికాస్ట్ కానుంది. ఇందులో ఫరియా పాత్రకు మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ అన్ని రిలీజ్ అయితే కచ్చితంగా ఫరియా కి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హీరోయిన్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది.