Balakrishna-Puri Jagannadh: నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన హీరో బాలయ్య…ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన లెగసీ కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళుతున్న నందమూరి అందగాడు బాలయ్య బాబు…ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లు గా గుర్తింపు పొందిన చాలామంది దర్శకులు ఈయనతో సినిమా చేయడానికి ఉత్సాహన్ని చూపిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఎవ్వరికీ అవకాశం ఇవ్వడం లేదు. తెలుగు డైరెక్టర్లకి మాత్రమే ఆయన పెద్దపీట వేస్తున్నారు.
మొదటి నుంచి కూడా బాలయ్య బాబుకి తెలుగు అంటే చాలా అభిమానం. అందుకే మన దర్శకులను మాత్రమే ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం బోయపాటితో ఒక సినిమాకి కమిట్ అయిన బాలయ్య, ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటికే ‘పైసా వసూల్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ బాలయ్య బాబుని చాలా జోవియల్ గా నిజ జీవితంలో బాలయ్య ఎలా ఉంటాడో అలాంటి పాత్రలో చూపించి ప్రేక్షకులకు దగ్గర చేశాడు.
అందుకే పూరి మీద బాలయ్య బాబు అభిమానులకి మంచి కాన్ఫిడెంట్ ఉంది. పూరి సినిమాలు ఎలా చేసినా, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయిన కూడా ఆయన సినిమాల్లో చేసిన హీరోలకి మాత్రం మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పైసా వసూల్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బాలయ్య బాబుకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీలో గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ లో గాని చాలా కొత్తదనాన్ని చూపించాడు.
అందుకే బాలయ్య బాబు అభిమానులు పూరి జగన్నాథ్ తో బాలయ్య సినిమా ఎప్పుడు అంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన హంగామా చేస్తున్నారు. దాంతో తొందర్లోనే బాలయ్య బాబు, పూరి కాంబినేషన్ పట్టలెక్కబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి…చూడాలి మరి పూరి బాలయ్య కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో…