
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లలో ఫిట్నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే.. తెలిసిన వారు ఎవరైనా ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ పేరే సూచిస్తారు. అంతగా తన ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తుంది రకుల్. అసలు.. రకుల్ అనగానే గుర్తుకు వచ్చే టాప్ మోస్ట్ పాయింట్స్ లో ఈ అమ్మడి శరీర సౌష్టవం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అద్దిరిపోయే బాడీ షేప్ తో అందానికి కేరాఫ్ అన్నట్టుగా ఉంటుందీ బ్యూటీ.
ఇందుకోసం పొద్దున్నే దేహాన్ని ఎంతగా కష్టపెడుతుందో తెలిసిందే. ఫిట్ నెస్ కోసం ప్రాణమిచ్చే ఈ అమ్మడు ఉదయాన్నే జిమ్ లో చెమటలు చిందిస్తుంది. ఆ తర్వాత యోగా, ధ్యానంతో తనువు, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటుంది. స్విమ్మింగ్, డైటింగ్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతానని గతంలో చాలా సార్లు ప్రకటించింది. అలాంటి రకుల్.. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పిక్స్ చూసి ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు సైతం అవాక్కయ్యారు. తను రకులేనా..? అని డౌట్ ఎక్స్ ప్రెస్ చేశారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కరోనా ఫస్ట్ వేవ్ లోనే కొవిడ్ బారిన పడిన రకుల్.. ఆ తర్వాత తన ఫిట్ నెస్ తో ఈజీగానే బయటపడింది. అనంతరం.. జనాలకు ఫిట్ నెస్ పాఠాలు కూడా చెప్పింది. కరోనా నుంచి బయటపడడానికి తాను ఏం చేశానో.. చెప్పి అవేర్ నెస్ క్రియేట్ చేసింది. అప్పుడు కూడా రకుల్ ఫిట్నెస్ కుగానీ.. అందానికిగానీ.. ఎలాంటి ఇబ్బంది వచ్చినట్టు కనిపించలేదు.
కానీ.. లేటెస్ట్ ఫొటోలు చూస్తే ఎవ్వరైనా నోరెళ్ల బెట్టాల్సిందే. బాడీతోపాటు ముఖం మొత్తం పీక్కుపోయినట్టుగా తయారైంది రకుల్. అద్భుతమైన శరీరాకృతి, అందంతో మత్తెక్కించే రకుల్.. ఇలా తయారవడానికి కారణం ఏంటని డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో.. కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. సినిమా ఛాన్సులు తగ్గిపోవడం వల్లే డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని కొందరు అంటుంటే.. మరికొందరు జీరో సైజ్ ట్రై చేస్తున్నట్టుంది అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటనేది తెలియదుగానీ.. మొత్తానికి రకుల్ లేటెస్ట్ ఫొటోలు మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. అయినప్పటికీ.. రీజన్ ఏంటనేది మాత్రం వెల్లడించలేదు ఈ పంజాబీ భామ.
సినిమాల సంగతి చూస్తే.. తెలుగులో వైష్ణవ్ తేజ్ తో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఒక చిత్రంలో రకుల్ నటించనుంది. ప్రస్తుతానికి అఫీషియల్ ప్రాజెక్టు ఇది మాత్రమే. బాలీవుడ్ లో అటాక్, మేడే, థాంక్ గాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.