Vijay Deverakonda And Rashmika: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు మంచి సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటారు. ఇక ఒకానొక సమయంలో సినిమాల్లో నటిస్తున్న క్రమంలో వాళ్ల మధ్య ప్రేమ చిగురించి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు సైతం ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ – రష్మిక మందాన లు సైతం వీళ్ళ జాబితాలో చేరిపోయారు. రీసెంట్ గా వీళ్లకు ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలైతే వైరల్ అయ్యాయి. ఇక ఇప్పటివరకు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా దీనిమీద అఫీషియల్ గా స్పందించలేదు. ఇక దానికి తగ్గట్టుగానే ఫోటోలు కూడా ఎక్కడ రిలీజ్ చేయలేదు… మొత్తానికైతే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరుగుతుందని కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదంతా చూస్తున్న మరి కొంతమంది మాత్రం వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు ఎవరు కూడా కలకాలం పాటు కలిసి ఉండడం లేదు.
ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుంటున్నారు… కాబట్టి వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. ఇక్కడ సక్సెస్, క్రేజ్ మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. తద్వారా పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా కూడా జనాల్లో సక్సెస్, క్రేజ్ రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు అన్నీ సర్దుకుంటాయి.
ఒకవేళ ఇవి ఈ మాత్రం తేడా కొట్టిన కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ లు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇప్పటి వరకు చాలాంచి ప్రేమికులుగా ఉన్నారు.కాబట్టి ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోతే బెటర్ అని, ప్రేమ పావురాలు గా కసి ఉండాలని అలా ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు రావని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నిజంగానే వీళ్లకు ఎంగేజ్మెంట్ అయిందా? అనే విషయాలు తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే పెళ్లి తర్వాత కూడా వీళ్ళు ఆదర్శ దంపతులుగా కొనసాగాలని ఇంకొంతమంది కోరుకుంటుండటం విశేషం…