Bulli Raju: ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లో బుల్లి రాజుగా నటించిన రేవంత్ ఓవర్ నైట్ స్టార్ కిడ్ గా పేరు తెచ్చేసుకున్నాడు. ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకరిగా రేవంత్ పేరు ని కూడా మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన పార్టీ గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం, అది డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజు కంట పడడంతో వెంటనే రేవంత్ ని పిలిచి ఆడిషన్స్ చేసి తీసుకున్నారట. ఇతనే రీసెంట్ గా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కుర్రాడికి సంబంధించిన వీడియో ని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ చేసారు.
అయితే ఓవర్ నైట్ పాపులారిటీ ఈ బుడ్డోడిని తెగ ఇబ్బందికి గురి చేస్తుంది. రీసెంట్ గానే ఈ బుడ్డోడు పబ్లిక్ ప్రాంతం లో కనపడితే జనాలు ఇతనితో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇక నేను వెళ్ళాలి దయచేసి నన్ను వెళ్లనివ్వండి అంటూ రేవంత్ ముందుకు వెళ్తుంటే ఒక అభిమాని అతన్ని బలవంతంగా వెనక్కి లాగి సెల్ఫీ తీసుకున్నాడు. పాపం రేవంత్ దాదాపుగా ఏడుపు ముఖం పెట్టేసాడు. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్, ఏంట్రా మనుషులు ఇలా తయారయ్యారు. పాపం ఆ బుడ్డోడిని భయపెట్టేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీస్తున్నారు. అయినా ఇతన్ని తల్లిదండ్రులు ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లారో, అసలే సెలబ్రిటీ అయ్యాడు, జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కేవలం ఈ బుడ్డోడి విషయం లో మాత్రమే కాదు, హీరోయిన్స్ విషయం లో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. హద్దులు మీరిన అభిమానం ఒక్కో సారి అనర్దాలకు దారి తీస్తుంది, దీనిని గమనించాలి.
ఇదంతా పక్కన పెడితే రేవంత్ కి ఇప్పుడు వరుసగా సినిమాల్లో అవకాశాలు క్యూలు కడుతున్నాయి. ఇతను ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నాడు. మరి అతని తల్లిదండ్రులు సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. రీసెంట్ గానే సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి మీడియా తో మాట్లాడుతూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని, ఆ సినిమా పేరు ‘మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు. వేరే సందర్భాన్ని తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తానని, సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించాడు. రేవంత్ భవిష్యత్తులో సినిమాలు చేసినా చేయకపోయినా ఈ చిత్రం లో మాత్రం కచ్చితంగా నటించాల్సి ఉంటుంది. F2,F3 తరహాలో వేర్వేరు కథలతో కాకుండా, ఈ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి కొనసాగింపు గా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుంది అనేది.
People Misbehaving With Bulli Raju
గోరంగా తయారయ్యారు మనుషులు#BulliRaju #SankranthikiVasthunampic.twitter.com/5WqQQ6VZKA
— Milagro Movies (@MilagroMovies) January 19, 2025