Samantha: టాలీవుడ్ లోనే కాదు..సౌత్ ఇండియా లోనే దశాబ్ద కాలం నుండి టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు సమంత..ఈమెకి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కేవలం అందాల ఆరబోతకే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకుంది..ప్రముఖ హీరో నాగ చైతన్య తో ప్రేమాయణం నడిపి అతనిని పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత కొనీళ్లకు విబెడ్లను వచ్చి విడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..అంత పెద్ద ఎదురుదెబ్బ జీవితం లో తగిలినా కూడా ఏ మాత్రం రాజి పడకుండా కెరీర్ ని మరింత పటిష్టం చేసుకొని వరుస సినిమాలతో బిజీ గా గడుపుతున్న సమంత ని చూసి ఆమె అభిమానులు ఎప్పుడూ గర్వపడుతూ ఉంటారు..అయితే సమంత గురించి లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఆమె అభిమానులను తెగ కంగారు పెడుతుంది.

అసలు విషయానికి వస్తే సమంత గత కొంత కాలం నుండి చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని..ఆమె ప్రస్తుతం సర్జరీ చేయించుకోవడం కోసం అమెరికా కి వెళ్లిందని..ఇందుకోసం ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్స్ ని కూడా పక్కన పెట్టేసిందని సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ప్రచారం అవుతున్న వార్త..ఈ వార్త ఆమె అభిమానులను తీవ్రంగా కంగారు పెడుతుంది..ఈ వార్తల్లో ఎంత వరుకు నిజం ఉంది అనేది ఎవ్వరు క్లారిటీ కూడా ఇవ్వలేదు.

ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ వచ్చే సమంత ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తీవ్రంగా ఖండించేది..కానీ ఇప్పుడు గత కొంతకాలం నుండి ఆమె సోషల్ మీడియా కి దూరం గా ఉంటూ వస్తుంది..ఆమె ప్రధాన పాత్ర లో నటించిన యశోద సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ టీజర్ కి సంబంధించిన ఒక్క పోస్టు మినహా..ఆమె ఈమధ్య సోషల్ మీడియా లో ఒక్క పోస్టు కూడా పెట్టలేదు..దీనితో సమంత మీద వచ్చిన ఆ రూమర్స్ రోజు రోజుకి బలపడుతూ వస్తుంది..ఈ వార్తలపై భవిష్యత్తులో అయినా ఆమె స్పందిస్తుందో లేదో చూడాలి.