Karthikeya 2 Collections: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సినిమాగా నిలిచిన చిత్రం కార్తికేయ 2..OTT కి అలవాటు పడిపోయిన జనం ఇక థియేటర్స్ కి రారు అని ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నా మాటలను అబద్దం చేస్తూ ,కంటెంట్ బాగుంటే బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు అని చెప్పడానికి ఉదాహరణ గా నిలిచింది ఈ చిత్రం..కేవలం 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఏకంగా 60 కోట్ల రూపాయిల వరుకు షేర్స్ ని రాబట్టింది అంటే మాములు విషయం కాదు..హిందీ లో అయితే కేవలం 60 షోస్ తో ప్రారంభం అయ్యింది..మొదటి రోజు కేవలం 2 లక్షల రూపాయిలు మాత్రమే నెట్ వసూళ్లు వచ్చాయి..కానీ టాక్ అద్భుతంగా రావడం తో రెండవ రోజు నుండి కలెక్షన్స్ పెరుగుతూ పోయాయి..అలా రోజు రోజు కి వసూళ్లు పెరుగుతూ పోయిన ఈ సినిమా హిందీ లో ఏకంగా 35 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..వచ్చే నెల నాల్గవ తేదీన OTT లో విడుదల కాబోతున్న ఈ సినిమా, థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యింది.

ప్రాంతాల వారీగా ఒకసారి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో చూస్తే..ఒక్క నైజం ప్రాంతం లోనే ఈ సినిమాకి దాదాపుగా 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..ఇది మాములు రికార్డు కాదనే చెప్పాలి..అలాగే రాయలసీమ ప్రాంతం లో 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం , ఉత్తరాంధ్ర లో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిలు..గోదావరి జిల్లాలు రెండు కలుపుకొని నాలుగు కోట్ల రూపాయిలు.

గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 80 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో రెండు కోట్ల 30 లక్షల రూపాయిలు..నెల్లూరు జిల్లాలో కోటి 10 లక్షల రూపాయిలు వసూళ్ళని రాబట్టి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..ఇక ఓవర్సీస్ లో 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం కర్ణాటక లో 3 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా ..హిందీ వెర్షన్ లో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 60 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.