Harika Narayan: ఈ మధ్య చాలా మంది ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఈ పెళ్లిల్లు కేవలం కామన్ పీపుల్ కు మాత్రమే కాదు.. సెలబ్రెటీలకు కూడా కామన్ అనే విషయం తెలిసిందే. కొందరు ఒకే సినిమాతో ప్రేమలో పడి పెళ్లిల్లు చేసుకుంటే.. కొందరు స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొందరి ప్రేమలు సక్సెస్ అయితే మరికొందరి ప్రేమలు మాత్రం మధ్యలోనే ఆగిపోతున్నాయి. అయితే రీసెంట్ గా మరో జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. వారెవరు అంటే?
రీసెంట్ గా టాలీవుడ్ సింగర్ హారిక నారయణ్ పెళ్లి చేసుకుంది. ఈమె కొన్ని రోజుల నుంచి పృథ్వీనాథ్ అనే అబ్బాయితో ప్రేమలో ఉందనే విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పి.. అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే ఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒకటైంది. ఈ వివాహ వేడుకకు పలువురు సింగర్లు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
పలు సినిమాల్లో పాటలు పాడుతూ ఫుల్ బిజీగా ఉంటుంది హారిక. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన పాడిన ఈమె సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. మొత్తం మీద స్నేహితుడు పృథ్వినాథ్ వెంపటి ని పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. వీరిద్దరు ఏకంగా ఏడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారట.
ఏడు సంవత్సరాల నుంచి మాది అద్బుతమైన బంధం. దీనిని అధికారికంగా మరో స్థాయికి తీసుకొని వెళ్తున్నాం.. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా ప్రారంభిద్దాం అంటూ హారిక నారాయణ్ పోస్టు చేసింది. ఈ పోస్టును చూసిన ప్రముఖులు, అభిమానులు హారికకు శుభాకాంక్షలు చెబుతున్నారు.