Nayanthara Samantha కరణ్ జోహార్ తాజా ఎపిసోడ్ ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7లో సమంత రూత్ ప్రభు అరంగేట్రం చేసింది. అయితే ఇందులో సమంత వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకులు చర్చకు వచ్చాయి. నాగచైతన్యతో విడాకులు సహా అన్నింటిని కరణ్ జోహర్ కూపీలాగారు. ఇక కరణ్ జోహర్ ప్రశ్నలతో నయనతార-సమంత అభిమానుల మధ్య చిచ్చుమొదలైంది. నయనతార ఫ్యాన్స్ ఇప్పుడు కరణ్ జోహర్ ను ట్రోల్ చేస్తున్నారు.

సమంత-అక్షయ్ కుమార్ జంటగా కాఫీ విత్ కరణ్ షో ఇటీవల ప్రసారమైంది. ఈ షోలో కరణ్ ఓ ప్రశ్నను సమంతను అడిగాడు. సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అంటూ ప్రశ్నించాడు. సమంత స్పందిస్తూ ఇటీవలే ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో నేను నయనతారతో కలిసి నటించానని.. సౌత్ లో నాలుగు భాషల్లో కూడా నాకు తెలిసి నయనతారనే నెంబర్ 1 అని చెప్పింది.
దీనికి కరణ్ జోహార్ రిప్లై ఇస్తూ.. ‘ఆర్మాక్స్ మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం.. అందులో నంబర్ 1 ప్లేసులో సమంత ఉంది’ అంటూ నయనతారను తక్కువగా చూపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇప్పుడు ఆమె అభిమానులు మండిపడుతున్నారు.
‘నీకు నయనతార అంటే అంత చులకన ఎందుకు?’ అంటూ నెటిజన్లు కరణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ లో కరీనా, ప్రియాంక చోప్రా ఎంతనో.. సౌత్ లో నయనతార కూడా అంతే పాపులారిటీ సంపాదించిందని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.
‘నయనతార, అనుష్క శెట్టి, అసిన్, త్రిష కృష్ణన్ మరియు నేను చెప్పని ఇతరులు మీ నేపో పిల్లలు కలలు కనే స్థాయిలో ఉన్నారు, ఎందుకంటే వారు ప్రతిభావంతులు. వారి సినీ పరిశ్రమలో మంచివారు’ అంటూ విమర్శలు గుప్పించారు. సౌత్ ఇండస్ట్రీ అన్నా.. సౌత్ హీరో హీరోయిన్లు అన్నా కరణ్ కు కుళ్లు అని అందుకే ఇలా అంటున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
నయనతార అట్లీ రాబోయే చిత్రంతో బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉంది. ‘జవాన్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్ 2023లో విడుదల కానుంది.