Tollywood Hero : టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వంతో వచ్చిన నటుల చాలా మంది ఉన్నారు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ లనుంచి నేటి మెగాస్టార్ చిరంజీవి వరకు తమకు కుమారులు, బంధువులు ఎంతో మంది తెలుగు సినిమా పరిశ్రమలో స్థిరపడ్డారు..అయితే వీరిలో కొందరు మాత్రమే స్టార్లుగా రాణిస్తున్నారు. మిగతా వారు అడపా దడపా సినిమాల్లో నటిస్తూ అలరిస్తారు. ఒక హీరో కొడుకు మరో హీరో అవుతారు.. ఒక డైరెక్టర్ కుమారుడు మరో డైరెక్టర్ అవుతారు.. అనే నానుడి ఉంది. కానీ తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ కెమెరామెన్ కు సంబంధించిన మేనల్లుడు హీరో అయ్యాడు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ సినీ ఇండస్ట్రీల అవకాశం ఇస్తుంది. అయితే మేనమామ తరుపున ఈ హీరో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించాడు. ఒక దశలో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించిన ఈయన ఇటీవల సినిమాల్లో నటించడం తగ్గించారు. కానీ మెయిన్ హీరోగా కాకుండా సైడ్ హీరోగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈయనకు సంబంధించిన ఓ చిన్న నాటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అలరిస్తోంది. ఇటీవల సెలబ్రెటీలో తమకు సంబంధించిన చిన్న నాటి ఫొటోలు అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాగే ఈ హీరో సైతం తనకు సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయన ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఆ వివరాల్లోకి వెళితే…
కొందరు స్టార్లుగా మారిన హీరోలు ముందుగా చిన్న సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చారు. అలా ‘స్నేహగీతం’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సందీప్ కిషన్. ఈయన 1897 మే 7న చెన్నైలో జన్మించాడు. సందీప్ తండ్రి వ్యాపారవేత్త తెలుగువారే. కానీ చెన్నైలో స్థిరపడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కెమెరామెన్ చోటా. కె. నాయుడుకి సందీప్ కిషన్ మేనల్లుడు అవుతారు. అయితే ఆ విషయం చాలా మందికి తెలియదు. సందీప్ కిషన్ సొంత టాలెంట్ తో గుర్తింపు పొందరు. చదువు పూర్తయిన తరువాత సందీప్ కిషన్ ‘స్నేహగీతం’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమాలో సందీప్ కిషన్ అర్జున్ పాత్ర పోషించారు. ఆ తరువాత ‘ప్రస్థానం’ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే 2013లో రిలీజ్ అయిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో ఈయన పాపులారిటీ తెచ్చుకున్నాడు. దీంతో సందీప్ కిషన్ కు వరుస ఆఫర్లు వచ్చాయి. దీంతో గుండెల్లో గోదారి, డి ఫర్ దోపిడీ, రారా కృష్ణయ్య, బీరువా, తెనాలి రామకృష్ణ వంటి సినిమాల్లో నటించారు. లవ్, ఫ్యామిలీ చిత్రాల్లోనే కాకుండా ఏ1 ఎక్స్ ప్రెస్ అనే యాక్షన్ సినిమాలతోనూ సందీప్ కిషన్ మెప్పించాడు. ఇక క్రీడా నేపథ్యంలో వచ్చిన ‘మైఖేల్’ మూవీలో సందీప్ యాక్షన్ కు మంచి మార్కులే పడ్డాయి.
అయితే హీరోగా ‘ఊరుపేరు బైరవకోన’ సినిమాలో నటించిన సందీప్ కిషన్ కు ఇటీవల ధనుష్ హీరోగా వచ్చిన ‘రాయన్’ సినిమాలో కనిపించాడు. హీరోగానే కాకుండా సైడ్ పాత్రల్లోనూ కనిపిస్తూ ఆకర్షించాడు. ఇక సినిమాల్లోనే కాకుండా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ లోకనిపించిన సందీప్ కిషన్ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. అయితే తమిళ ఇండస్ట్రీ వైపు సందీప్ కిషన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ‘రాయన్’ సినిమాలో కనిపించినట్లు సమాచారం.ఈ తరుణంలో ఆయనకు సంబంధించిన చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More