Homeఎంటర్టైన్మెంట్Famous Actress: సబ్బులు అమ్ముకుంటు బ్రతుకుతున్న ప్రముఖ నటి.. చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

Famous Actress: సబ్బులు అమ్ముకుంటు బ్రతుకుతున్న ప్రముఖ నటి.. చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

Famous Actress: సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం అని పెద్దలు అంటూ ఉంటారు..ఈ ఇండస్ట్రీ లో ఒక్క వ్యక్తి ఎంత ఎత్తుకి తొందరగా ఎదగగలడో..అంతే వేగంగా కిందకి పడిపోగలడు కూడా..సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఈ వాస్తవం నుండి తప్పించుకోలేకపొయ్యారు..ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ లాగ మారింది ఒక్క పాపులర్ క్యారక్టర్ ఆర్టిస్టు జీవితం..ప్రముఖ హీరోయిన్ మరియు క్యారక్టర్ ఆర్టిస్టు లక్ష్మి గారి కుమార్తె గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం సినిమాలు మాత్రమే కాదు టీవీ సీరియల్స్ లో కూడా ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి డిమాండ్ లో కొంతకాలం వరుకు కొనసాగింది..కానీ ప్రస్తుతం ఈమె దయనీయమైన పరిస్థితి చూస్తే కన్నీళ్లు పెట్టక తప్పదు..ఇండస్ట్రీ లో ఇంత పాపులర్ ఫేమ్ ని దక్కించుకున్న ఈమె ఇప్పుడు ఇలా సినిమాల్లో అవకాశాలు లేక ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ చివరికి వీధుల్లో ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకునే పరిస్థితి కి వచ్చేసింది..ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన ఆర్ధిక పరిస్థితి గురించి వివరిస్తూ ఆమె మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది .

Famous Actress
Aishwarya, Senoir Actress Lakshmi

Also Read: Jabardasth Comedian Ram Prasad: చివరికి ఆ కమెడియనే రామ్ ప్రసాద్ కి గతి అయ్యాడు!

ఈమె మన తెలుగు లో చివరిసారిగా కనిపించిన సినిమా ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమా..ఏడాదికి కనీసం నాలుగైదు సినిమాలతో బిజీ గా ఉండే ఐశ్వర్య గత కొంత కాలం నుండి చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఇబ్బంది పడుతుంది..ఈమె మలయాళం లో మోహన్ లాల్ తో మూడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది..కానీ ఆ తర్వాత హీరోయిన్ గా విజయాలు రాకపోవడం తో క్యారక్టర్ ఆర్టిస్టుగా మారింది..క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ఈమె దాదాపుగా అన్ని భాషలకు కలిపి 100 కి పైగా సినిమాల్లో నటించింది..అలాగే టీవీ సీరియల్స్ లో అయితే డజనుకు పైగా నటించింది..ఇంత పెద్ద ఆర్టిస్టు ఆర్ధిక ఇబ్బందులలో మునిగిపోయి ఇప్పుడు వీధుల్లో ప్రతి ఇంటికి తిరిగి సబ్బులు అమ్ముకునే సేల్స్ గర్ల్ లాగ మారిపోయింది..ప్రస్తుతం ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తుంది..ఈ ఛానల్ లో తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి ప్రొమోషన్స్ చేస్తూ ఉంటుంది..ప్రస్తుతం ఈమె నాకు ఎవరైనా ఒక మెగా సీరియల్ లో నటించే అవకాశం ఇప్పిస్తే నాకు చాలా మేలు చేసినవారు అవుతారు అంటూ కంటతడి పెట్టుకొని ప్రాధేయపడింది..మరి ఈమె మాటలకు కరిగి దర్శక నిర్మాతలు ఈమెకి తమ సినిమాలలో కానీ సీరియల్స్ లో కానీ అవకాశాలు ఇస్తారా లేదా అనేది చూడాలి.

Famous Actress
Aishwarya

Also Read: Bandla Ganesh: బండ్ల గణేష్ కు ఏమైంది? ఆడియో లీక్.. అన్యాయం చేసింది పవన్ కళ్యాణా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version