ORMAX Media Survey: ఎన్టీఆర్ ని వెనక్కినెట్టి దూసుకొచ్చిన ప్రభాస్, మహేష్… తాజా ర్యాంకింగ్స్ ఏంటంటే!

ORMAX Media Survey: టాలీవుడ్ లో అత్యధికంగా పది మంది టాప్ స్టార్స్ ఉన్నారు. వీరిలో చాలా మంది మార్కెట్ రెండు వందల కోట్లను దాటిపోయింది. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లు సాధించి నయా రికార్డ్స్ నమోదు చేశారు. ఈ కారణంగానే దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా టాలీవుడ్ ఎదిగింది. మరి ఈ టాప్ స్టార్స్ లో ఎవరు నంబర్ […]

Written By: Shiva, Updated On : June 18, 2022 3:25 pm
Follow us on

ORMAX Media Survey: టాలీవుడ్ లో అత్యధికంగా పది మంది టాప్ స్టార్స్ ఉన్నారు. వీరిలో చాలా మంది మార్కెట్ రెండు వందల కోట్లను దాటిపోయింది. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లు సాధించి నయా రికార్డ్స్ నమోదు చేశారు. ఈ కారణంగానే దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా టాలీవుడ్ ఎదిగింది. మరి ఈ టాప్ స్టార్స్ లో ఎవరు నంబర్ వన్? జనాల్లో ఎవరి పాపులారిటీ ఎంత? అనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

ORMAX Media Survey

ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఆర్మాక్స్ తన లేటెస్ట్ సర్వే రిజల్ట్ తో వచ్చేసింది. మే 2022 వరకు పాపులారిటీ పరంగా టాలీవుడ్ స్టార్స్ లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో లిస్ట్ విడుదల చేశారు. తెలుగు హీరోల్లో దేశవ్యాప్తంగా ఎవరి పాపులారిటీ ఎంత? అనేది సినీ జనాల ఎంపిక, అభిప్రాయాల ప్రకారం ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ లో ప్రభాస్, మహేష్ దూసుకు వచ్చారు. నంబర్ వన్ గా ఉన్న ఎన్టీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఏప్రిల్ 22 సర్వేలో ఎన్టీఆర్ టాలీవుడ్ హీరోల్లో నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.

Also Read: Dance India Dance: జూన్ 23 నుండి జీతెలుగులో ‘డాన్స్ ఇండియా డాన్స్’.. త్వరపడండి!

ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ పరాజయం పాలైనప్పటికీ ప్రభాస్ నంబర్ వన్ పొజిషన్ దక్కించుకున్నారు. ఇక సర్కారు వారి పాట చిత్రంలో మరో సూపర్ హిట్ నమోదు చేసిన మహేష్.. టాప్ లోకి దూసుకొచ్చారు. తాజా సర్వే ప్రకారం మహేష్ 2వ స్థానం దక్కించుకున్నారు. ఇక 3వ స్థానం ఎన్టీఆర్ ది కాగా, 4వ స్థానం అల్లు అర్జున్, 5వ స్థానం రామ్ చరణ్ దక్కించుకున్నారు. ఏప్రిల్ ఫలితాల ప్రకారం మహేష్ 5వ స్థానంలో ఉండగా అల్లు అర్జున్ 3, చరణ్ 4వ స్థానాల్లో ఉన్నారు. మహేష్ ర్యాంక్ మెరుగైంది. అల్లు అర్జున్, చరణ్ ర్యాంక్స్ పడిపోయాయి.

prabhas, mahesh babu

పవన్ కళ్యాణ్ పొజిషన్ స్థిరంగా ఉంది. ఆయన తన 6వ స్థానం పదిలం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కి టాప్ 5లో చోటు దక్కకపోవడం విశేషం. పవన్ తర్వాత నాని 7వ స్థానం, విజయ్ దేవరకొండ 8వ స్థానం, 9వ స్థానంలో చిరంజీవి, 10వ స్థానంలో రవితేజ కొనసాగుతున్నారు. వీరి ర్యాంకింగ్స్ లో కూడా ఎటువంటి మార్పులు లేకపోవడం విశేషం.

సర్కారు వారి పాట విజయంతో మహేష్ ర్యాంకింగ్ లో జోరుచుపించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయం నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ మెరుగైన ర్యాంక్స్ సాధిస్తున్నారు. పుష్ప మూవీ అల్లు అర్జున్ ఇమేజ్ కి ప్లస్ కాగా, టాప్ 5 పొజిషన్ పదిలం చేసుకుంటున్నాడు. ఆర్మాక్స్ సంస్థ సర్వే ప్రకారం 2022 మే నెల వరకు పాపులారిటీ పరంగా టాలీవుడ్ స్టార్స్ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి. 1. ప్రభాస్, 2. మహేష్ 3. ఎన్టీఆర్ 4. అల్లు అర్జున్ 5. రామ్ చరణ్ 6. పవన్ కళ్యాణ్ 7. నాని 8. విజయ్ దేవరకొండ 9. చిరంజీవి 10. రవితేజ. సీనియర్ స్టార్స్ లో ఒక్క చిరంజీవికి మాత్రమే టాప్ 10లో చోటు దక్కింది.

Also Read:Sri Reddy: వంటలు చూపించే శ్రీరెడ్డి ఏంటి ఈసారి ఇది చూపించింది

Tags