Family Stars Latest Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. కన్నడ పరిశ్రమకు చెందిన నిఖిల్ తెలుగులో సీరియల్స్ చేశాడు. బుల్లితెర ఆడియన్స్ లో అతనికి ఫేమ్ ఉంది. దానికి తోడు మెరుగైన ఆట తీరుతో నిఖిల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఒకరిద్దరు లేడీ కంటెస్టెంట్స్ తో సన్నిహితంగా ఉన్నాడు. సోనియా ఆకులతో నిఖిల్ రిలేషన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. పృథ్వి, నిఖిల్ లతో రిలేషన్ నడిపిన సోనియాను ఆడియన్స్ చాలా త్వరగా బయటకు పంపారు.
Also Read: కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!
అనంతరం నిఖిల్ కంటెస్టెంట్స్ యష్మికి దగ్గరయ్యాడు. ఆమె కూడా నిఖిల్ పట్ల ఆకర్షితురాలు అయ్యింది. అదే సమయంలో వీరిద్దరి మధ్య గొడవలు, మనస్పర్థలు కూడా తలెత్తాయి. నిఖిల్ తో గొడవ యష్మికి మైనస్ అయ్యింది. 12వ వారం ఆమె ఎలిమినేట్ అయ్యింది. కాగా హౌస్లో నిఖిల్ తన లవ్ స్టోరీ ఒకటి రెండు సందర్భాల్లో బయటపెట్టాడు. సీరియల్ నటి కావ్యను ఉద్దేశిస్తూ పరోక్షంగా కామెంట్స్ చేశాడు. తనతో విడిపోయినప్పటికీ అంగీకరిస్తే ఇప్పటికీ కలిసేందుకు సిద్ధం అన్నాడు. షో నుండి బయటకు వెళ్ళాక, ఆమెను కలిసి బ్రతిమిలాడుకుంటానని.. అన్నాడు.
షోలో నిఖిల్ చేసిన కామెంట్స్ కి బయట ఉన్న కావ్య కౌంటర్లు ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా నిఖిల్ కి వ్యతిరేకంగా ఆమె పోస్ట్స్ పెట్టింది. కట్ చేస్తే … నిఖిల్ టైటిల్ అందుకున్నాడు. కానీ కావ్యను కలవలేదు. ఒకవేళ కలవాలనుకున్నా ఆమె అవకాశం ఇవ్వలేదేమో తెలియదు. నిఖిల్ మీద కావ్య కోపంగా ఉందన్నది మాత్రం నిజం. తాజాగా మరోసారి కావ్య తన అసహనం బయటపెట్టింది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఉన్న ఫ్యామిలీ స్టార్ షోకి కావ్య గెస్ట్ గా వచ్చింది.
”నువ్వు నువ్వు” అనే రొమాంటిక్ సాంగ్ కి కావ్య డాన్స్ చేసింది. ఈ సాంగ్ అనంతరం.. మీరు సింగిలా లేక రిలేషన్ లో ఉన్నారా? అని కావ్యను సుధీర్ అడిగాడు. అందుకు సమాధానంగా.. ”గతంలో నేను ఒక స్నేహితుడిని గుడ్డిగా నమ్మాను. అతడిని నమ్మడమే నేను చేసిన అతిపెద్ద తప్పు” అని కావ్య అన్నారు. కావ్య ఈ కామెంట్స్ నిఖిల్ ని ఉద్దేశించే చేసిందంటూ నెటిజెన్స్ భావిస్తున్నారు. నిఖిల్ ఫ్యాన్స్ ఆమె మీద ఫైర్ అవుతున్నారు.
Also Read: ‘శబ్దం’ ఫుల్ మూవీ రివ్యూ…