Family Stars: అరియనా, అషురెడ్డి సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేర్లు. ఇంస్టాగ్రామ్ వేదికగా వీరిద్దరూ చేసే గ్లామర్ షో నెటిజెన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటారు. తమ పొట్టి బట్టలపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోరు . పైగా కౌంటర్స్ వేస్తుంటారు. అరియనా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్. అయితే పెద్దగా రాణించలేదు. గ్లామర్ షోనే నమ్ముకున్న అషురెడ్డిని ఆడియన్స్ త్వరగానే ఇంటికి పంపారు.
Also Read: రామ్ చరణ్ హిట్ కొడితే ఎన్టీఆర్ బాధపడక తప్పదు.. లాజిక్ ఇదే!
ఇక యూట్యూబ్ యాంకర్ అయిన అరియనా సైతం బిగ్ బాస్ షో వేదికగా పాపులర్ అయ్యింది. సీజన్ 4లో ఆమె కంటెస్ట్ చేసింది. అరియనా షోలో సత్తా చాటింది. ముక్కుసూటి గేమ్ తో ఫైనల్ కి వెళ్ళింది. అషురెడ్డి, అరియనా చాలా సన్నిహితంగా ఉంటారు. ఆర్జీవీ గ్లామర్ గర్ల్స్ గా వీరిని చెప్పుకోవచ్చు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వీరిద్దరిపై బోల్డ్ ఇంటర్వ్యూలు చేశారు. అషురెడ్డి రెండు బోల్డ్ ఇంటర్వ్యూలు చేసింది. అరియనాను జిమ్ లో వర్మ చేసిన ఇంటర్వ్యూలో వైరల్ అయ్యింది.
అరియనా, అషురెడ్డి పలు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ షోకి వచ్చారు. ఈ షోకి సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఉన్నాడు. నాకు సర్జరీ జరుగుతుంటే ఒక ఫ్రెండ్ ఆసుపత్రికి వచ్చిందని ఆశించాను రాలేదు. అది ఎవరో కాదు, అరియనా అని అషురెడ్డి అంది. నువ్వు ఆ విషయం ఇన్నాళ్లు మనసులో పెట్టుకున్నావా? అని అరియనా సమాధానం ఇచ్చింది. బాగున్నప్పుడు ఎవడైనా వస్తాడు, బాగోనప్పుడేగా పట్టించుకోవాల్సింది అని అషురెడ్డి కౌంటర్ వేసింది.
నేను ఫోన్ చేస్తే నీ ఎడిటర్ ఎత్తాడు. ఆంటీతో మాట్లాడాను,అని అరియనా సమాధానం చెప్పింది. నీకు నా ఇంటి అడ్రెస్ తెలుసుగా, రావచ్చుగా, ఫోన్ చేయడమేంటి? అని అషురెడ్డి అసహనం వ్యక్తం చేసింది. నువ్వు ఒక ఫ్రెండ్ కి వీడియో కాల్ లో అందుబాటులో ఉంటావు.. నాకు మాత్రం ఫోన్ లో కూడా దొరకవు అని అరియనా ఎద్దేవా చేసింది. ఒకప్పటి మంచి మిత్రులు అరియనా-అషురెడ్డి పబ్లిక్ లో గొడవపడటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ గొడవ ఎలా ముగిసిందో తెలియాలంటే… ఫ్యామిలీ స్టార్ ఫుల్ ఎపిసోడ్ చూడాలి.
Also Read: ‘హరి హర వీరమల్లు’ అధికారికంగా వాయిదా పడినట్టే..ఖరారు చేసిన నిర్మాత..మరి విడుదల అయ్యేది ఎప్పుడు?