Aavesham: సాధారణంగా సినిమా ప్రియులకు కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా సరే బోర్ అనిపించదు. పదేపదే ఎన్ని సార్లు చూసిన విసుగు పుట్టని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఒకటి. గత ఏడాది థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఓటిటి లో ఈ సినిమాను ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. గత ఏడు నెలల నుంచి ఓటిటి లో ఈ సినిమా టాప్ లో ఉందంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన కూడా ప్రేక్షకులకు ఈ సినిమా మీద క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఓటిటి లో ప్రసారమవుతున్న ఈ సినిమాను చూసి సినిమా ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా పేరు ఆవేశం. మలయాళం లో రూపొందిన ఈ సినిమా పవర్ ఫుల్ సినిమా.ఓటిటి లో ఆవేశం సినిమాకు చాలా క్రేజ్ ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలలో థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో కనిపించారు. యాక్షన్ తో పాటు ఈ సినిమాలోని కామెడీ కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా కథ మొత్తం బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థుల మధ్య సాగుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో చదివే ఈ ముగ్గురు విద్యార్థులు సీరియల్స్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఈ క్రమంలోనే విసుగు చెందిన ముగ్గురు విద్యార్థులు తమ పై అధికారులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు.
దాంతో వాళ్లు గ్యాంగ్ స్టర్ రంగా దగ్గరికి వెళ్తారు. రంగా పాత్రను ఫహద్ పోషించారు. ఇక ఈ ముగ్గురు విద్యార్థులు రంగాతో కలిసి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఏదో జరగడంతో ఆ ముగ్గురు విద్యార్థులు రంగాని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇదే ఈ సినిమాకు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా కథ చాలా బలంగా ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన ఆవేశం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
అలాగే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా ఓటిటి లో సంచలనం సృష్టిస్తుంది. ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆవేశం సినిమా జూన్ 28, 2024 లో రిలీజ్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యే ఏడు నెలలు గడిచిన టాప్ ట్రెండింగ్ లో ఉంది.థియేటర్లలో చూడని ప్రేక్షకులు తమ ఇంటి దగ్గర నుంచే వెంటనే ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయండి.