https://oktelugu.com/

Pushpa 2 : షెకావత్ సార్ ఏదో చేసే లాగానే ఉన్నాడే.. ఈ లుక్ చూసాక పుష్ప 2పై భారీ అంచనాలు…

పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక డిసెంబర్ ఆరోవ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలుపెట్టారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 9, 2024 / 08:25 AM IST

    Fahadh Faasil Birthday Wishes from Pushpa 2 Movie First Look Released

    Follow us on

    Pushpa 2 : సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకి తగ్గట్టుగానే సుకుమార్ కూడా ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నటుగా తెలుస్తుంది. పుష్ప మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆటోమేటిగ్గా రెండో పార్ట్ మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ జనాలు మొత్తం పుష్ప 2 సినిమా కోసమే చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇక అందులో భాగంగానే ఈరోజు ఫహాద్ ఫాజిల్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో ఫహద్ ఫాజిల్ లుంగీ కట్టుకొని, కాకి చుక్క వేసుకొని, చేతిలో గొడ్డలి పట్టుకొని చాలా క్లియర్ గా కనిపిస్తున్నాడు. ఇక దీంతో బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి పుష్ప మొదటి పార్ట్ లో బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ అంత పెద్దగా ఉండదు. ఈ సినిమా చివర్లో వచ్చి ఆయన సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కాబట్టి మొదటి పార్ట్ లో ఆయనకు పుష్ప చేతిలో భారీ అవమానం అయితే జరుగుతుంది.

    ఇక ఆ అవమానానికి ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యం తోనే తను రెండో పార్ట్ లో కీలకపాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక తను అనుకున్నట్టుగానే పుష్ప మీద భారీ రేంజ్ లో రివెంజ్ తీర్చుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ మొత్తం తనను బేస్ చేసుకొని స్క్రిప్ట్ నడవబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక తన బర్త్ డే రోజు ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి సినిమా యూనిట్ అతని పోస్టర్ ను రిలీజ్ చేసింది అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే బన్వర్ సింగ్ షేకవత్ తన క్యారెక్టర్ కి ఎలాంటి ఎలివేషన్ అయితే కావాలో అలాంటి ఒక ఎలివేషన్ ఒక్క పోస్టర్ తోనే ఇచ్చేశాడు.

    సుకుమార్ కి నిజంగా హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. మలయాళం సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఫహద్ ఫాజిల్ ని ఈ క్యారెక్టర్ కోసం తీసుకోవడమే సుకుమార్ చేసిన మంచి పని ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఆ క్యారెక్టర్ లో అంతా ఇంపాక్ట్ తీసుకొచ్చి ఉండే వారు కాదని సినిమా యూనిట్ అయితే చెబుతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఆయన యాక్టింగ్ ఎలా ఉంది. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఆయనకు సినిమా కెరియర్ పరంగా ఏ విధంగా ఉపయోగపడింది అనే విషయాలైతే తెలిసే అవకాశాలైతే లేవు… కాబట్టి ఈ సినిమా సక్సెస్ ఫుల్ సినిమాగా మారాలంటే మాత్రం తన క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండాలి…